గోల్డెన్ గ్లోబ్ అవార్డు గెలుచుకున్న రాజమౌళి ‘ఆర్ఆర్ఆర్’.. ‘నాటు నాటు’ పాటకు అవార్డు అందుకున్న కీరవాణి

RRR Wins Golden Globe Award in Best Original Song Category Music Director Keeravani Receives Trophy,Music Director Keeravani,Keeravani Receives Golden Globe Award,RRR Wins Golden Globe Award,Best Original Song Category,Best Original Song Naatu Naatu,Mango News,Mango News Telugu,Future Of Young India,Mega Power Star Ram Charan,Mega Power Star,S.S.Rajamouli,RRR,Rise Roar Revolt,Ram Charan Latest News and Updates,Ram Charan News and Live Updates,Ram Charan Latest Movie Updates

టాలీవుడ్ దిగ్గజ దర్శకుడు రాజమౌళి దర్శత్వం వహించిన ‘ఆర్ఆర్ఆర్’ సినిమా చరిత్ర సృష్టించింది. ఇప్పటికే ఎన్నో అవార్డులను గెలుచుకున్న ఈ సినిమా తాజాగా ప్రపంచ చలన చిత్ర రంగంలో ప్రతిష్టాత్మకంగా భావించే ‘గోల్డెన్ గ్లోబ్’ అవార్డును గెలుచుకుంది. ఉత్తమ ఒరిజినల్ సాంగ్ విభాగంలో ‘నాటు నాటు’ పాటకు గాను ఈ చిత్రానికి అవార్డు వరించింది. దీంతో ఈ అవార్డు అందుకున్న తొలి భారతీయ చిత్రంగా ఆర్ఆర్ఆర్ నిలిచింది. ఈ మేరకు చిత్ర సంగీత దర్శకుడు ఎమ్ఎమ్ కీరవాణి సగర్వంగా అవార్డు అందుకున్నారు. చంద్రబోస్ ఈ పాటను రాయగా.. ప్రేమ్ రక్షిత్ కొరియోగ్రఫీ అందించారు. ఇక ఈ అవార్డుల ప్రదానోత్సవంలో దర్శకుడు రాజమౌళి, నటులు జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ మరియు సంగీత దర్శకుడు కీరవాణి కుటుంబాలతో సహా హాజరై సందడి చేశారు.

కాగా కీరవాణి అవార్డు అందుకుంటున్న సమయంలో రాజమౌళి, ఎన్టీఆర్, రామ్ చరణ్ కరతాళ ధ్వనులతో తమ హర్షం వ్యక్తం చేశారు. ఏ సందర్భంగా కీరవాణి మాట్లాడుతూ.. ‘ఈ ప్రతిష్టాత్మక అవార్డు అందుకోవడం చాలా సంతోషంగా ఉంది. దీనికి మూలకారకుడు నా సోదరుడు రాజమౌళి. ఈ పాటను ఆలపించిన రాహుల్ సిప్లిగంజ్ మరియు నా కుమారుడు కాలభైరవలకు ధన్యవాదాలు’ అని పేర్కొన్నారు. దీనికి ముందు అవార్డ్స్‌ వేడుకక హాజరైన ఆర్‌ఆర్‌ఆర్‌ చిత్ర బృందం రెడ్‌కార్పేట్‌పై సందడి చేసింది. కాగా 80వ గోల్డెన్ గ్లోబ్ అవార్డులు ఈరోజు అమెరికాలోని లాస్ ఏంజిల్స్‌లో జరిగాయి. హాస్యనటుడు జెరోడ్ కార్మిచెల్ ఈ అవార్డుల కార్యక్రమానికి హోస్ట్ చేశారు.

ఇక బెస్ట్ ఒరిజినల్ సాంగ్ విభాగంలో ఇతర చిత్రాలు.. క్రాడడ్స్ సింగ్ నుండి ‘కరోలినా’ (టేలర్ స్విఫ్ట్), ‘సియావో పాపా’ (అలెగ్జాండ్రే డెస్ప్లాట్, రోబన్ కాట్జ్ మరియు గిల్లెర్మో డెల్ టోరో) – గిల్లెర్మో డెల్ టోరోస్ పినోక్ ‘హోల్డ్ మై హ్యాండ్’ (లేడీ గాగా, బ్లడ్‌పాప్ మరియు బెంజమిన్ రైస్) – టాప్ గన్: మావెరిక్ మరియు ‘లిఫ్ట్ మీ అప్’ (టెమ్స్, రిహన్న, ర్యాన్ కూగ్లర్ మరియు లుడ్విగ్ గోరాన్సన్) – బ్లాక్ పాంథర్: వకాండ ఫరెవర్ వంటివాటితో పోటీపడి మరీ ‘నాటు నాటు’ పాట అవార్డు గెలుచుకోవడం విశేషం. అయితే ఈ చిత్రం ఉత్తమ ఆంగ్లేతర భాషా చిత్రం విభాగంలో కూడా పోటీ పడినా.. చివరకి దీనిని ‘అర్జెంటీనా 1985’ అనే సినిమా గెలుచుకుంది. అలాగే ది ఫాబెల్‌మన్స్ చిత్రానికి గానూ దిగ్గజ దర్శకుడు స్టీవెన్ స్పీల్‌బర్గ్ ఉత్తమ దర్శకుడిగా అవార్డు పొందారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

seventeen + 13 =