అమృత్‌సర్ స్వర్ణ దేవాలయాన్ని సందర్శించిన రాహుల్, ఆపరేషన్‌ బ్లూస్టార్ తర్వాత తొలిసారి గాంధీ కుటుంబ సభ్యుడి రాక

Congress Leader Rahul Gandhi Visits Golden Temple in Amritsar Today As Bharat Jodo Yatra Enters Punjab,Rahul Gandhi Bharat Jodo Yatra,Rahul Gandhi Schedule Today,Rahul Gandhi Speech,Mango News,Rahul Gandhi T Shirt,Rahul Gandhi Twitter,Airport Near Golden Temple Punjab,Chennai To Golden Temple Punjab,Golden Temple Amritsar,Golden Temple Architecture,Golden Temple Punjab,Golden Temple Punjab News,Golden Temple Punjab Timings,Golden Temple Punjab Vector,Golden Temple Punjab Video,Golden Temple Timings,Golden Temple Wikipedia,Harmandir Sahib Golden Temple- Punjab,Hukamnama Golden Temple Punjab Today,Nearest Railway Station To Golden Temple Punjab,Vadodara To Golden Temple Punjab

కాంగ్రెస్ అగ్రనేత, ఎంపీ రాహుల్ గాంధీ ఆధ్వర్యంలో కొనసాగుతున్న ‘భారత్ జోడో యాత్ర’ మంగళవారం శంభు సరిహద్దు గుండా పంజాబ్‌లోకి ప్రవేశించింది. అంతకుముందు యాత్రలో స్వల్ప మార్పులు చేయడంతో షెడ్యూల్‌ సమయం కన్నా ముందే ఆయన అమృత్‌సర్‌ చేరుకున్నారు. ఈ క్రమంలో ఆయన అమృత్‌సర్‌లోని స్వర్ణ దేవాలయాన్ని సందర్శించారు. కాషాయ రంగు తలపాగా ధరించిన రాహుల్ గాంధీ స్వర్ణ దేవాలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆయనతో పాటు కాంగ్రెస్ ప్రతిపక్ష నేత ప్రతాప్ సింగ్ బజ్వా సహా ఇతర పార్టీ నేతలు పాల్గొన్నారు. కాగా దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ‘బ్లూ స్టార్‌ ఆపరేషన్‌’ మాజీ ప్రధాని ఇందిరా గాంధీ కుటుంబంలోని వ్యక్తి ఒకరు గోల్డెన్‌ టెంపుల్‌కి రావడం ఇదే తొలిసారి కావడం విశేషం.

ఈ నేపథ్యంలో దాదాపు 3 దశాబ్దాల అనంతరం వారి కుటుంబ సభ్యుడు ఒకరు స్వర్ణ దేవాలయాన్ని సందర్శించడం ఒకింత ఆసక్తి కలిగించింది. ఇక రాహుల్ గాంధీకి పటిష్ట భద్రత ఉన్నప్పటికీ వారెవరూ ఆయన వెంట స్వర్ణ దేవాలయంలోకి వెళ్ళలేదు. కాగా నేటినుంచి పంజాబ్‌లో మరో ఎనిమిది రోజుల పాటు 350 కిలోమీటర్ల దూరం యాత్ర రాష్ట్రంలో కొనసాగనుంది. అయితే భద్రతా సంస్థల హెచ్చరికలు చేసిన నేపథ్యంలో రాహుల్ గాంధీ సగం యాత్ర కారులో ఉండే పాల్గొననున్నారు. ఈ క్రమంలో యాత్ర బుధవారం ఫతేఘర్ సాహిబ్ నుండి ప్రారంభమవనుంది. లోహ్రీ పండుగ కారణంగా జనవరి 13న యాత్ర ఉండదు. పంజాబ్‌లో ముగిసిన అనంతరం యాత్ర జనవరి 18న ముకేరియన్ నుండి హిమాచల్ ప్రదేశ్‌ చేరుకుంటుంది.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

10 − 2 =