
వచ్చే ఎన్నికలలో ఎలా అయినా గెలిచేది తామే అనుకున్నారో.. ఓవర్ కాన్ఫిడెన్స్ పెంచుకున్నారో కానీ సార్వత్రిక ఎన్నికలకు ముందు వైసీపీ నేతలంతా రెచ్చిపోయి మరీ శపథాలు చేశారు. అంతే ఓవర్ కాన్ఫిడెన్స్‌తో లక్షలు, కోట్లలో బెట్టింగులు వేసి ప్రాణాలు, ఆస్తులు కోల్పోయి రోడ్డు పాలయ్యారు వైసీపీ అభిమానులు. మొత్తంగా జూన్ 4 తర్వాత ఎన్నికల సమయంలో వైసీపీ నేతలు ఏం మాట్లాడారో వాటిని వెతికి మరీ కౌంటర్లు ఇచ్చే పనిలో పడ్డారు కూటమి మద్దతుదారులు. టోటల్‌గా ఎన్నికల ముందు వైసీపీ నాయకులు చేసిన సవాళ్లు ఇప్పుడు వారందరికీ కొత్త తలనొప్పులను తెచ్చిపెడతున్నాయి.
తాజాగా ఈ లిస్టులోకి మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి చేరిపోయారు. గురజాల నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డికి వ్యతిరేకంగా ఫ్లెక్సీలు కనిపిస్తున్నాయి. గురుజాల స్థానం నుంచి యరపతినేని శ్రీనివాసరావు గెలిస్తే తాను రాజకీయ సన్యాసం తీసుకుంటానని కాసు మహేష్ రెడ్డి బహిరంగ సవాల్ విసిరిన విషయం తెలిసిందే. కానీ ఈ ఎన్నికలలో మహేష్ రెడ్డి ఓడిపోవడంతో రాజకీయ సన్యాసం ఎప్పుడు తీసుకుంటారని ప్రశ్నిస్తూ రాష్ట్ర తెలుగు యువత ఉపాధ్యక్షుడు రామకృష్ణ ఫ్లెక్సీ వేసి మరీ కాసు మహేశ్‌రెడ్డికి కౌంటర్ ఇస్తున్నారు.దీనికి సంబంధించిన ఫ్లెక్సీలు కొన్ని సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతున్నాయి.ముఖ్యంగా కాసు మహేష్ రెడ్డి యాడికి పారిపోయినవ్’ అంటూ గురజాలలో వెలసిన ఫ్లెక్సీలు అక్కడ హాట్ టాపిక్ అయ్యాయి.
మొన్నటి మొన్న కుప్పం నియోజకవర్గంలో నారా చంద్రబాబు నాయుడు కనుక గెలిస్తే..ఆయన బూట్లలు పాలిష్ చేస్తానని అన్న కొడాలి నానిపై తెలుగు దేశం పార్టీ నేతలు ఓ రేంజ్లో ఆటాడుకున్నారు. నానీ ఎక్కడున్నావంటూ..గుడివాడలో చంద్రబాబు నాయుడి షూ పాలిష్ ఎప్పుడు చేస్తావంటూ బ్యానర్లు వేసి టీడీపీ నాయకులు మాస్ ర్యాగింగ్ చేశారు. నానీ కనిపించడం లేదంటూ పోస్టర్లు కూడా వేసి కౌంటర్లు వేసారు. అలాగే మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్‌ను తాను ఓడిపోతే రాజకీయ సన్యాసం తీసుకుంటానని అన్న మాటలను మీడియా మిత్రులు ప్రశ్నించగా..తాను చాలెంజ్ విసిరానని..కానీ ఆ చాలెంజ్ ఎవరూ యాక్సెప్ట్ చేయలేదని కొత్త లాజిక్‌లు లాగి అప్పటికి తప్పించుకున్నారు. దీంతో గెలుపోటములు సహజమని ..గెలుపు ఇచ్చిన ఆనందాన్ని అనుభవించాలి కానీ అడ్డదిడ్డంగా మాట్లాడి నోటికి పని చెబితే పరిస్థితులు ఇలాగే ఉంటాయని సోషల్ మీడియాలో కామెంట్లు వినిపిస్తున్నాయి.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE