టాలీవుడ్ నటులు మెగాస్టార్ చిరంజీవి, అక్కినేని నాగార్జునలను కలిసిన కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్

Union Minister Anurag Thakur Meets Tollywood Actors Megastar Chiranjeevi and Akkineni Nagarjuna in Hyderabad, Union Minister Anurag Thakur Meet,Union Minister Meets Tollywood Actors,Tollywood Actor Megastar Chiranjeevi,Akkineni Nagarjuna in Hyderabad, Anurag Thakur Meets Chiranjeevi and Nagarjuna, Megastar and Akkineni Meet, Mango News, Mango News Telugu, Anurag Thakur Wife,Akkineni Nagarjuna Age,Akkineni Nagarjuna Father,Akkineni Nagarjuna Instagram,Akkineni Nagarjuna Twitter,Akkineni Nagarjuna Wife,Anurag Thakur Family,Anurag Thakur Minister Contact Number,Anurag Thakur Salary,Chief Secretary Assam Contact Details,Megastar Chiranjeevi,Megastar Chiranjeevi Family,Megastar Chiranjeevi Godfather,Union Sports Minister Anurag Thakur,Union Territory Of Delhi

కేంద్ర యువజన వ్యవహారాలు మరియు క్రీడల శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్, బీజేపీ కార్నర్ మీటింగ్స్ కార్యక్రమంలో పాల్గొనేందుకు హైదరాబాద్‌ పర్యటనకు వచ్చారు. పర్యటనలో భాగంగా బీజేపీ కార్యక్రమాల్లో పాల్గొన్న ఆయన అనంతరం టాలీవుడ్ అగ్రహీరోలు మెగాస్టార్ చిరంజీవి మరియు అక్కినేని నాగార్జునలు కలిశారు. ఈ మేరకు ఆదివారం మెగాస్టార్ ఇంటికి వచ్చిన కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్‌కు చిరంజీవి సాదర స్వాగతం పలికారు. ఈ సందర్భంగా నాగార్జున, ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ తదితరులు కూడా కేంద్రమంత్రిని కలుసుకున్నారు. అయితే వీరి కలయికకు ఎలాంటి రాజకీయ కారణం లేదని తెలుస్తోంది. కేవలం మర్యాదపూర్వకంగానే వీరి భేటీ జరిగినట్లు తెలుస్తోంది. మెగాస్టార్ చిరంజీవి, అక్కినేని నాగార్జునతో కలిసి కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ గురించి చిట్-చాట్ చేశారని సమాచారం.

ఇక ఈ సందర్బంగా తెలుగు చిత్ర పరిశ్రమకు సంబంధించిన కొన్ని సమస్యలు, అలాగే కేంద్ర ప్రభుత్వం సహకారం తదితర విషయాల గురించి వీరు చర్చించినట్లు తెలుస్తోంది. ఈ మేరకు మెగాస్టార్ చిరంజీవి తన ట్విట్టర్ ద్వారా దీనిని తెలియజేశారు. ‘నిన్న మీరు హైదరాబాద్ సందర్శనలో నా దగ్గరికి రావడానికి సమయం కేటాయించినందుకు ప్రియమైన అనురాగ్ ఠాకూర్‌కు ధన్యవాదాలు. భారతీయ చలనచిత్ర పరిశ్రమ గురించి మరియు అది సాధిస్తున్న వేగవంతమైన పురోగతి గురించి నా సోదరుడు నాగార్జునతో కలిసి మేము జరిపిన సంతోషకరమైన చర్చ నాకు నచ్చింది” అని పేర్కొన్నారు. కాగా కేంద్రమంత్రి, మెగాస్టార్‌ను కలిసిన ఈ చిత్రాలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

4 × 2 =