ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా అరెస్టును ఖండించిన బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్

BRS Working President KTR Condemns Manish Sisodia Detention By CBI Calls It as Undemocratic, BRS Working President KTR, KTR Condemns Manish Sisodia, Manish Sisodia Detention By CBI, BRS President KTR Calls Undemocratic, Mango News, Manish Sisodia Whatsapp Number,Aap Liquor Policy,Delhi Alcohol,Delhi Deputy Cm Manish Sisodia,Delhi Deputy Cm Manish Sisodia Contact Number,Delhi Liquor News,Delhi Liquor Policy Case,Deputy Cm Manish Sisodia Contact Number,Deputy Cm Of Delhi Contact Details,Deputy Cm Of Mumbai,Liquor Gate Scandal, New Excise Policy Delhi,Trs President Ktr,Ktr Trs Contact Number,Trs Assembly Seats,Trs District Presidents List,Trs Government Formation Date,Trs Leaders List

ఢిల్లీ మద్యం కుంభకోణం కేసు విచారణలో ఆప్ కీలక నేత, ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియాను సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) ఆదివారం అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మనీశ్ సిసోడియా అరెస్టును బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ ఖండించారు. మనీశ్ సిసోడియా అరెస్టు ఆప్రజాస్వామికమని, బీజేపీ పార్టీ ప్రతిపక్షాలపైన వ్యవహరిస్తున్న తీరు దుర్మార్గపూరితమని కేటీఆర్ పేర్కొన్నారు. “కేంద్ర ప్రభుత్వం పరిధిలోని ఏజెన్సీలను ప్రతిపక్షాలపై ఉసిగొలిపి దొంగచాటు రాజకీయాలను బీజేపీ చేస్తుంది. ప్రజాబలం లేక అధికారంలోకి రాలేని ప్రాంతాల్లో రాష్ట్రాల్లో అక్కడి పార్టీలను కేంద్ర ప్రభుత్వ ఏజెన్సీలను ఉపయోగించుకొని బలహీనపరిచే కుట్రలో భాగమే సిసోడియా అరెస్ట్. బీజేపీ ప్రతిపక్షాలపై చేస్తున్న రాజకీయ కుట్రలు దేశంలో ప్రజాస్వామ్యానికి గొడ్డలిపెట్టుగా మారాయి. బీజేపీ కక్ష సాధింపు రాజకీయాలకు మనీష్ సిసోడియా అరెస్ట్ పరాకాష్ట” అని కేటీఆర్ పేర్కొన్నారు.

“ఢిల్లీ మేయర్ ఎన్నికల్లో సుప్రీంకోర్టు ద్వారా చివాట్లు తిన్న తర్వాత ఎదురైన పరాజయాన్ని తట్టుకోలేక సిసోడియాను ఇప్పుడు అరెస్ట్ చేశారు. బీజేపీ అసమర్థ విధానాలను, అవినీతిని ప్రశ్నిస్తున్న బలమైన పార్టీలను నాయకులను ఎదుర్కోలేక పిరికి రాజకీయాలు చేస్తుంది. బీజేపీ తన పార్టీలోని అవినీతి నాయకులను సత్యహరిశ్చంద్రుని సహోదరులుగా చూపించి, ప్రతిపక్షాల నాయకులను అవినీతిపరులుగా చిత్రీకరించి కుటిల ప్రయత్నాలను చేస్తుంది. బీజేపీ నీతిలేని దుర్మార్గపు రాజకీయాలను దేశం గమనిస్తుంది. బీజేపీ కుట్రపూరిత రాజకీయాలను ప్రజలు కచ్చితంగా తిప్పి కొడతారు. భవిష్యత్తులో బీజేపీ నాయకులకు ఇదే గతి పడుతుంది. ప్రజాబలం లేక దొడ్డిదారిన రాజకీయాలు చేయడం, అధికారంలోకి రావడం బీజేపీకి అలవాటుగా మారింది. ఇప్పటికే దేశంలో 9 రాష్ట్రాల ప్రభుత్వాలను కూల్చిన అప్రజాస్వామిక పార్టీ బీజేపీ. తన ప్రలోభాలకు లొంగకుండా నిలబడిన పార్టీలను దెబ్బతీసే కుట్రలను బీజేపీ చేస్తుంది. తెలంగాణలోనూ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు కుట్ర చేసి బీజేపీ భంగపడింది. బీజేపీ కుటిల ప్రయత్నాలను కెమెరాల సాక్షిగా ప్రజలు గమనించారు. బీజేపీ అప్రజాస్వామిక, దుర్మార్గపూరిత కుట్రలకి కాలం దగ్గర పడింది” అని కేటీఆర్ అన్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్: 

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

9 − seven =