వైసీపీకి ప్రతిపక్ష హోదా ఇవ్వొచ్చా? స్పీకర్‌కు వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి రాసిన లేఖలో న్యాయం ఉందా? అసలు రాజ్యాంగం ఏం చెబుతోంది?.. ప్రస్తుతం ఈ ప్రశ్నలు చర్చనీయాంశంగా మారాయి. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీకి కనీసం పదిశాతం సీట్లు కూడా దక్కలేదు. మొత్తం 175 అసెంబ్లీ స్థానాలు ఉంటే.. అందులో కేవలం 11 స్థానాలను మాత్రమే గెలుచుకుంది. ఈక్రమంలో ఆ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడికి లేఖ రాశారు. తమకు ప్రతిపక్ష హోదా కల్పించాలని లేఖలో కోరారు. అయితే అసలు ప్రతిపక్ష హోదాకు సంబంధించి రాజ్యాంగం ఏం చెబుతోంది?.. నిజంగా పది శాతం సీట్లు వస్తేనే ప్రతిపక్ష హోదా దక్కుతుందా? అనేది చర్చనీయాంశంగా మారింది.
అసలు రాజ్యాంగంలో ప్రతిపక్షం గురించి ఎక్కడ కూడా ప్రస్తావనే లేదని రాజ్యాంగ నిపుణులు అంటున్నారు. 10 శాతం సీట్లు దక్కించుకుంటేనే ప్రతిపక్ష హోదా కల్పించడం అనేది.. 1950లో అసెంబ్లీలో సభ్యులకు పార్టీలకు ముందు వరసలో సీట్లు కేటాయించే విషయంలో ఏర్పాటు చేసుకున్న ఒక సర్దుబాటు మాత్రమేనని స్పష్టం చేశారు. అప్పుడు ఎవరు ముందు వరుసలో కూర్చోవాలి.. ఎవరు వెనుక వరుసలో కూర్చోవాలి అనే దానిపై సమస్య తలెత్తడంతో.. పది శాతానికి పైగా సీట్లు దక్కించుకున్న పార్టీలు ముందు వరుసలో కూర్చొనేలా ఏర్పాటు చేసుకున్నారని వివరించారు. అంతేతప్పించి దీనిపై రాజ్యాంగంలో ఎటువంటి ప్రస్తావన లేదని.. పదో వంతు సీట్లు వచ్చిన పార్టీకే ప్రతిపక్ష హోదా అని ఎక్కడా నిర్దిష్టంగా చెప్పలేదని స్పష్టం చేశారు.
ఇదే సమయంలో సభలో ఏ నిర్ణయం తీసుకోవాలన్నా స్పీకర్ చేతిలోనే ఉంటుంది. ప్రస్తుతం ఏపీ అసెంబ్లీ స్పీకర్‌గా అయ్యన్నపాత్రుడు ఉన్నందున.. వైసీపీకి ప్రతిపక్ష హోదా ఇవ్వాలా? లేదా? అన్నది ఆయన చేతిలోనే ఉంటుందని నిపుణులు అంటున్నారు. గతంలో ఢిల్లీ అసెంబ్లీలో ఓసారి ఇదే సమస్య వచ్చింది. ఢిల్లీలో మొత్తం 70 అసెంబ్లీ స్థానాలు ఉండగా.. ఓసారి బీజేపీ కేవలం మూడు స్థానాలను మాత్రమే గెలుచుకుంది. మిగిలిన స్థానాలను ఆమ్ ఆద్మీ పార్టీ దక్కించుకొని అధికారంలోకి వచ్చింది. అయితే ఆ సమయంలో బీజేపీకి పది శాతం సీట్లు రాలేదు. అయినప్పటికి కూడా అప్పటి స్పీకర్ బీజేపీకి ప్రతిపక్ష హోదా కల్పించారు. దీంతో ఇప్పుడు వైసీపీకి కూడా ప్రతిపక్ష హోదా ఇవ్వాలా? లేదా? అన్నది స్పీకర్ అయ్యన్నపాత్రుడిపై ఆధారపడి ఉంది.
అయితే ముందు నుంచి కూడా వైసీపీ అన్నా.. ఆ పార్టీ నేతలన్నా అయ్యన్నపాత్రుడు ఒంటికాలిపై లేస్తుంటాడు. గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వైసీపీ నేతలు ఆయన్ను తీవ్రంగా ఇబ్బందులకు గురి చేశారు. అయినప్పటికీ ఆయన వెనక్కి తగ్గకుండా వారితో పోరాడారు. ఇప్పుడు అయ్యన్నకు టైమ్ వచ్చింది. మరి అయ్యన్నపాత్రుడు ఏ నిర్ణయం తీసుకుంటారో చూడాలి.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE