గెలుపే లక్ష్యంగా.. చంద్రబాబు దంపతుల ప్రత్యేక యాగాలు

With The Aim Of Winning Chandrababu Couple Special Sacrifices, The Aim Of Winning, Chandrababu Couple Special Sacrifices, Chandrababu Aim Of Winning, Chandrababu Naidu, Telugu Desam Party, Yagam, AP Assembly Elections, AP Political News, Latest Political News,AP News, Mango News, Mango News Telugu
Chandrababu naidu, Telugu desam party, Yagam, AP Assembly elections

ఐదేళ్లుగా అధికారానికి దూరంగా ఉన్న తెలుగు దేశం పార్టీ ఈసారి ఎలాగైనా గెలిచి తీరాలని పట్టుదలతో ఉంది. అందుకే ఇప్పటి నుంచే వ్యూహాత్మకంగా అడుగులేస్తోంది. అధికార వైసీపీని గద్దె దించేందుకు జనసేనతో పొత్తు పెట్టుకొని ఎన్నికలకు వెళ్తోంది.  ఎన్నికల్లో గెలుపొందేందుకు ఉన్న ఏ ఒక్క అవకాశాన్ని కూడా వదలకుండా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ముందుకు కదులుతున్నారు. అయితే ఇటీవల రాజకీయ నాయకులు రాజకీయంగా కీలక అడుగులేస్తున్నప్పుడు యాగాలు చేయడం తెలిసిన విషయమే. ఇప్పుడు చంద్రబాబు నాయుడు కూడా ఆ దిశగా అడుగులేస్తున్నారు. ఎన్నికల్లో గెలుపు కోసం యాగాలు చేసేందుకు సిద్ధమయ్యారు.

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల వేళ గులాబీ బాస్ కేసీఆర్ కూడా యాగాలు చేశారు. తన ఫామ్‌హౌజ్‌లో రాగశ్యామల యాగం నిర్వహించారు. అంతకంటే ముందు జనసేనాని పవన్ కళ్యాణ్ కూడా యాగం చేశారు.  వారాహి యాత్ర ప్రారంభించే ముందు పార్టీ కార్యాలయంలో యాగం చేశారు. ఈక్రమంలో ఎన్నికల కదణరంగంలోకి దూకే ముందు యాగం నిర్వహించాలని చంద్రబాబు నిర్ణయించారు. ఈరోజు నుంచి మూడు రోజుల పాటు యాగాలు చంద్రబాబు యాగాలు నిర్వహించనున్నారు.

ఉండవల్లిలోని తమ నివాసంలో చంద్రబాబు, ఆయన కుటుంబ సభ్యులు యాగాలు నిర్వహించబోతున్నారు. ఈరోజు నుంచి మూడు రోజుల పాటు.. శతచండీ పారాయణ ఏకోత్తర వృద్ధి చండీయాగం, సుదర్శన నారసింహ హోమంత చేయనున్నారు. ఇందుకోసం దేశవ్యాప్తంగా పలు ప్రసిద్ధ వేద పండితులను రప్పించినట్లు తెలుస్తోంది. ఇక మూడు రోజల పాటు యాగం నిర్వహిస్తున్నందున చంద్రబాబు తన అపాయింట్ మెంట్లన్నీ రద్దు చేసుకున్నారట.

ఇటీవల చంద్రబాబు నాయుడు జైలు కెళ్లినప్పుడు కూడా టీడీపీ నాయకులు పెద్ద ఎత్తున యాగాలు నిర్వహించారు. కలిగిరలో టీడీపీ నేతలు శత చండీ రుద్రయాగం చేశారు. ఆ తర్వాత కొద్ది రోజులకే చంద్రబాబు జైలు నుంచి బయటకొచ్చారు. ఇక ఎన్నికల్లో గెలుపొందాలని కేసీఆర్ యాగాలు చేసినప్పటికీ అవి ఫలించలేదు. బీఆర్ఎస్ పార్టీ ఓటమి పాలయింది. మరి చంద్రబాబు చేస్తున్న యాగాలు ఫలిస్తాయా.. ఆంధ్రప్రదేశ్‌లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తుందా..? అనేది ఆసక్తికరంగా మారింది.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYF

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

18 − two =