మళ్లీ 2303లోనే అరుదైన సందర్భం

A Marvel In Space History Again In 2303 A Rare Occasion, Marvel In Space History Again, Marvel In Space History Again In 2303, 2303 A Rare Occasion Occasion, Marvel In Space History, Winter Solstice,Shortest day 2023 ,A Marvel In Space History,Again In 2303 A Rare Occasion, Latest Marvel News, Marvel Latest News Update, Marvel 2023, Mango News, Mango News Telugu
Winter Solstice,Shortest day 2023 ,A marvel in space history,Again in 2303 a rare occasion

అంతరిక్ష చరిత్రలో  డిసెంబర్ 22, డిసెంబర్ 23న అద్భుతం ఆవిష్కృతం అవుతోంది. ఇలాంటి సందర్భం కోసమే  అంతరిక్ష పరిశోధకులు  ఎన్నాళ్ల నుంచో ఎదురు చూస్తోన్నారు. 1903 డిసెంబర్ 23వ తేదీ తరువాత మళ్లీ అలాంటి ఖగోళ అద్భుతం ఇప్పుడు సంభవించబోతోంది

ఈ ఏడాదిలో షార్టెస్ట్ డే ఏర్పడబోతోన్నట్లు శాస్త్రజ్ఞులు ప్రకటించారు. పగటి సమయం తక్కువగా  అంటే..మిగిలిన రోజుల కంటే పగలు తక్కువ సేపు.. రాత్రి సమయం ఎక్కువసేపు ఉంటుంది. డిసెంబర్ 22,డిసెంబర్ 23 తేదీల్లో వచ్చే ఇలాంటి అరుదైన సందర్భం మళ్లీ ఏర్పడాలంటే  2303వ సంవత్సరం వరకు  అంతా ఎదురు చూడక తప్పదని అంటున్నారు.

అరుదుగా జరిగే ఇలాంటి పరిణామాన్ని చలి కాలపు అయనాంతంగా సైంటిస్టులు పిలుస్తారు. ప్రతి ఏడాది ఇది ఏర్పడేదే అయినా కూడా.. ఈ సారి వచ్చే అయనాంతానికి కొన్ని ప్రత్యేకతలు ఉన్నాయి. సాధారణంగా ఈ చలికాలపు అయనాంతం అనేది డిసెంబర్ 21న సంభవిస్తుంటుంది.

ఈ సారి మాత్రం ప్రతీ సంవత్సరం వచ్చేలా కాకుండా తేదీ మారింది. ఈసారి ఏకంగా రెండు రోజుల పాటు డిసెంబర్ 22,23వ తేదీల్లో  కనిపిస్తుంది. ఉత్తరధృవం సమయాన్ని, వివిధ దేశాల టైమ్ జోన్‌ పరిగణనలోకి తీసుకుని  శీతాకాలపు అయనాంతాన్ని లెక్కపెడతారు.  ఉత్తర ధృవంలో షార్టెస్ట్ డే.. లాంగెస్ట్ నైట్‌ ప్రభావం ఎక్కువగా ఉంటుంది. ఈ రెండింటి మధ్య గల తేడా ఏమిటనేది అక్కడే క్లియర్‌గా  తెలుస్తుంది.

సూర్యుని చుట్టూ భూమి తిరుగుతున్నప్పుడు, అది దాని అక్షం మీద 23.4 డిగ్రీలు వంగి ఉంటుందనే విషయం మనందరికీ తెలిసిందే. అలా తిరిగే సమయంలో వంపు ఉన్న ప్రదేశం.. సూర్యుడి దిశగా ఉంటే అప్పుడు పగటి సమయం ఎక్కువగా ఉంటుంది. సూర్యుడికి దూరంగా ఉంటే మాత్రం చీకటి ఎక్కువ సేపు ఉంటుంది.

అయనాంతం ఏర్పడే స్థితిలో ఉత్తరార్ధ గోళం సూర్యుడికి దూరంగా ఉండబోతోంది. ఉత్తర ధృవానికి సూర్యరశ్మి చాలా తక్కువగా సోకుతుంది. దీనివల్ల అక్కడ రాత్రి సమయం సుదీర్ఘంగా ఉంటుంది. పగటి పూట వెలుతురు 7 గంటల 14 నిమిషాల పాటు మాత్రమే ఉంటుంది. ఈ టైములో సూర్య కిరణాలు అక్కడ పడవు. భారత కాలమానాన్ని పరిగణనలోకి తీసుకుంటే ఈ ఉదయం 8.57 నిమిషాలకు శీతాకాలపు అయనాంతం ప్రారంభమైనట్లేనని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

9 − five =