టీడీపీ అధినేత చంద్రబాబుకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన మెగాస్టార్ చిరంజీవి, వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి సహా పలువురు ప్రముఖులు

YCP MP Vijayasai Reddy Megastar Chiranjeevi and Others Extends Birthday Wishes To TDP Chief Chandrababu,YCP MP Vijayasai Reddy Wishes To TDP Chief Chandrababu,Megastar Chiranjeevi and Others Extends Birthday Wishes,Birthday Wishes To TDP Chief Chandrababu,Mango News,Mango News Telugu,Vijayasai Reddy Birthday Wishes To Chandrababu,Chiranjeevi birthday wishes to EX CM Chandrababu,Party Chief Chandrababu Naidu AP Wide Today,Birthday Celebrations of Party Chief,Birthday Celebrations of Chandrababu Naidu,Naidu Turns 72,TDP Cadres Celebrate Birthday Across AP,Telugu Desam Party,AP Politics,AP Latest Political News,Andhra Pradesh Latest News,Andhra Pradesh News,Andhra Pradesh News and Live Updates

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు జన్మదినం సందర్భంగా పలువురు ప్రముఖులు ఆయనకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా టీడీపీ నాయకులు, కార్యకర్తలు వేడుకలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో సొంతపార్టీ నేతలే కాకుండా పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు చంద్రబాబుకు జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఏపీలోని అధికార వైఎస్సార్సీపీకి చెందిన రాజ్యసభ ఎంపీ విజయసాయి రెడ్డి ట్విట్టర్ ద్వారా ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పారు. చంద్రబాబు నాయుడు సంపూర్ణ ఆరోగ్యం, దీర్ఘాయుష్షుతో మరెన్నో ఆనందకరమైన పుట్టినరోజులు జరుపుకోవాలని ఆయన ఆకాంక్షించారు.

అలాగే ఎంపీ రఘురామ కృష్ణంరాజు సైతం చంద్రబాబుకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన.. ’14 ఏళ్లు ముఖ్యమంత్రిగా చేసి, ఎన్నో సంస్కరణలకు మార్గదర్శి అయిన చంద్రబాబు నాయుడు ప్రజలు సంతోషంగా ఉండాలనే ఆకాంక్షతో ఇప్పటికీ కృషి చేస్తున్నారు. అలాంటి నేతకు జన్మదిన శుభాకాంక్షలు’ అని చెప్పారు. మరోవైపు మెగాస్టార్ చిరంజీవి కూడా ట్విట్టర్ ద్వారా చంద్రబాబుకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. భగవంతుడు ఆయనకు ఆశీస్సులు అందించాలని, సంపూర్ణ ఆయురారోగ్యాలు ప్రసాదించాలని కోరుకుంటున్నాను’ అని పేర్కొన్నారు.

ఇక చంద్రబాబు తనయుడు, టీడీపీ యువనేత, ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా లోకేష్ కూడా తండ్రికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ట్విట్టర్ లో ఆయన.. ‘తెలుగు ప్రజల జీవితాలను మార్చడానికి మరియు శాశ్వతమైన వారసత్వాన్ని వదిలివేయడానికి మీరు ఎంత మక్కువ చూపుతున్నారో నాకు తెలుసు. నీ కోరికలన్నీ తీరాలి నాన్నా! పుట్టినరోజు శుభాకాంక్షలు!’ అని పేర్కొన్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్: 

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

eighteen + twenty =