ఏపీలో విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై డెక్కన్ క్రానికల్ సంస్థ రాసిన ఆర్టికల్ ప్రకంపణలు సృష్టిస్తోంది. ఇప్పటికే ఈ వివాదంపై అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. ఒకరిపై ఒకరు తీవ్ర విమర్శలు చేసుకుంటున్నారు. కేంద్రంతో కలిసి విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని ప్రైవేట్ పరం చేసేందుకు కూటమి ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోందని వైసీపీ ఆరోపిస్తోంది. కానీ అది ఒక పెయిడ్ ఆర్టికల్ అని.. వైసీపీనే ఆ ఆర్టికల్ రాయించిందని కూటమి ప్రభుత్వం ఆరోపిస్తోంది. ప్రభుత్వంపై తప్పుడు ప్రచారం చేయించేందుకు ఇటువంటి ప్రయత్నాలు చేస్తున్నారని కూటమి నేతలు భగ్గుమంటున్నారు.
ఇటీవల ఈ వివాదంపై వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి స్పందిస్తూ ప్రభుత్వంపై భగ్గుమన్నారు. మీడియా సంస్థలపై దాడి చేసి.. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారని మండిపడ్డారు. తెలుగు దేశం పార్టీ పిరికితనంతో డెక్కన్ క్రానికల్ ఆఫీసుపై దాడి చేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. నిష్పక్షపాతంతో పనిచేసే మీడియాను అణచివేస్తున్నారని.. ఈ ఘటనను తాను తీవ్రంగా ఖండిస్తున్నట్లు వెల్లడించారు. అలాగే ఇది యావత్ మీడియాపై జరిగిన దాడిగా జగన్మోహన్ రెడ్డి పేర్కొన్నారు. అయితే నిత్యం జగన్‌పై ఒంటి కాలుపై లేసే తన చెల్లెలు షర్మిల.. ఇప్పుడు ఆయన వ్యాఖ్యలకు సపోర్ట్‌గా మాట్లాడడం సంచలనంగా మారింది. దీనిపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.
వైసీపీ అన్నా.. తన అన్న వైఎస్ జగ్ అన్నా నిప్పులు చెరుగుతుంటారు వైఎస్ షర్మిల. ఎన్నికలప్పుడు కూడా కాంగ్రెస్ గెలుపు కంటే.. వైసీపీ ఓటమే లక్ష్యంగా షర్మిల పావులు కదిపారు. జగన్‌పై విమర్శలు చేస్తూ.. వైసీపీ ప్రభుత్వ తప్పులను ఎత్తి చూపుతూ ప్రచారం నిర్వహించారు. కానీ ఇప్పుడు డెక్కన్ క్రానికల్ వివాదంలో జగన్‌కు సపోర్ట్ చేస్తూ షర్మిల మాట్లాడారు. జగన్ అభిప్రాయంతో ఆమె ఏకీభవించారు. విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ప్రైవేటీకరణను అడ్డుకోకుండా ఎదురు చర్యలు ఏంటని షర్మిల ప్రశ్నించారు. దమ్ముంటే మోడీని నిలదీయాలని.. నిలదీసే గొంతులపై ఉక్కు పాదం మోపడం సరైన పద్ధతి కాదని వ్యాఖ్యానించారు. ఇలాంటి దాడులను ప్రజాస్వామ్యం కోసం పాటుపడే పార్టీగా కాంగ్రెస్ కచ్చితంగా వ్యతిరేకిస్తుందని వెల్లడించారు. ఈ వ్యవహారంపై జగన్, షర్మిల ఒకే విధంగా రియాక్ట్ కావడం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశమయింది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE