ఏపీలో కాంగ్రెస్‌కు పూర్వవైభవం తీసుకొచ్చేందుకు తీవ్రంగా కృషి చేశారు వైఎస్ షర్మిల. ఎన్నికల ముంగిట తన పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేసి.. ఏపీ కాంగ్రెస్ పగ్గాలు చేజిక్కించుకున్నారు. అప్పటి అధికారపక్షమైన వైసీపీపై మాటల తూటాలు పేలుస్తూ ముందుకు వెళ్లారు. వైసీపీ ప్రభుత్వ తప్పులను ఎత్తిపొడుస్తూ సంచలన బాంబులు పేల్చారు. ఓవైపు కాంగ్రెస్‌కు పూర్వవైభవం తీసుకొచ్చేందుకు కృషి చేస్తూనే.. మరోవైపు వైసీపీని గద్దె దించేందుకు కంకణం కట్టుకున్నారు. ఒక రకంగా చెప్పాలంటే సొంత అన్నపై పెద్ద యుద్ధమే చేశారు.
అయితే ఎన్నికల ముందు షర్మిల దూకుడుగా వెళ్లినప్పటికీ ఫలితాలు మాత్రం బెడిసి కొట్టాయి. కాంగ్రెస్ అసెంబ్లీలో గానీ.. లోక్ సభలో గానీ ఒక్క స్థానాన్ని కూడా దక్కించుకోలేక పోయింది. దీంతో ఫలితాలు వెలువడినప్పటి నుంచి షర్మిల సైలెంట్ అయిపోయారు. దాదాపు నెల రోజుల పాటు సైలెంట్‌గా ఉన్న షర్మిల.. ఇప్పుడు తిరిగి మళ్లీ ఫామ్‌లోకి వచ్చారు. ఇటీవల ఢిల్లీ వెళ్లి కాంగ్రెస్ అగ్రనేతలను షర్మిల కలిశారు. అటు పార్టీ పెద్దలు ఏపీలో కాంగ్రెస్‌ను పటిష్టం చేయడంపై రష్మిలకు పలు సలహాలు సూచనలు చేశారు. అప్పటి నుంచి షర్మిల తిరిగి ఫామ్‌లోకి వచ్చారు.
ఇటీవల మీడియాతో మాట్లాడుతూ షర్మిల సంచలన వ్యాఖ్యలు చేశారు. అధికార టీడీపీ కూటమి ఇప్పటికైనా ఏపీకి ప్రత్యేక హోదా తీసుకురావాలని డిమాండ్ చేశారు. కేంద్రంలో ఎన్డీయే ప్రభుత్వం కొలువుదీరడానికి చంద్రబాబే కారణమని.. అందువల్ల ప్రత్యేక హోదా విషయంలో టీడీపీ ఎక్కడా తగ్గొద్దని వెల్లడించారు. ఇలా టీడీపీ కూటమి ముందు పలు డిమాండ్లు పెట్టారు. అలాగే వైసీపీ నుంచి నేతలు కాంగ్రెస్‌లో చేరుతారా? అని మీడియా ప్రతినిధి ప్రశ్నించగా.. పిల్ల కాలువలు అన్నీ చివరికి సముద్రంలోనే చేరాలి కదా అని సమాధానం ఇచ్చారు.
అంటే వైసీపీ పిల్ల కాలువ అని.. కాంగ్రెస్ సముద్రం అని షర్మిల చెప్పకనే చెప్పారు. దీన్ని బట్టి చూస్తూ త్వరలోనే వైసీపీ నుంచి కాంగ్రెస్‌లోకి పెద్ద ఎత్తున చేరికలు ఉంటాయని తెలుస్తోంది. ఇప్పటికే ఎన్నికల ముందు కొందరు సీనియర్లు కాంగ్రెస్ బాట పట్టారు. వైసీపీలో టికెట్ దక్కనివారు.. కాంగ్రెస్ పార్టీలో చేరి టికెట్ దక్కించుకున్నారు. ప్రస్తుతం వైసీపీలో ఉన్న సీనియర్లంతా వైసీపీ వారే. వారిలో చాలా మంది తిరిగి సొంత గూటికి చేరనున్నట్లు తెలుస్తోంది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE