తెలుగు బిగ్ బాస్ సీజన్ 8 ప్రారంభమై ఐదు వారాలు పూర్తయ్యాయి. దీంతో ఆడియన్స్ లో కంటెస్టెంట్ల పట్ల అంచనాలు కూడా ఏర్పడ్డాయి. మెయిన్ గా టైటిల్ రేస్ లో ముగ్గురు కంటెస్టెంట్లు ఉన్నారని అంటున్నారు. 5 వారాలు పూర్తి చేసుకున్న బిగ్ బాస్ షో 14 మంది కంటెస్టెంట్స్ తో ప్రారంభం అవగా..ఇప్పటికి 6 మంది ఎలిమినేట్ అయ్యారు.
మొదటి వారంలో బెజవాడ బేబక్క, రెండో వారం శేఖర్ బాషా మూడవవారం అభయ్ నవీన్, నాలుగవ వారం సోనియా, ఐదో వారంలో మిడ్ వీక్ ఎలిమినేషన్లో ఆదిత్య ఓం బయటకు రాగా ఐదో వారం నైనిక ఎలిమినేట్ అయ్యారు. మొత్తం 6 మంది సభ్యులు హౌస్ నుంచి ఎలిమినేట్ అవ్వగా.. ఆదివారం బిగ్ బాస్ సీజన్ 8 గ్రాండ్ ఈవెంట్ 2.0 లో ఏకంగా ఎనిమిది మంది కంటెస్టెంట్స్ హౌస్ లోకి వైల్డ్ కార్డు ఎంట్రీ ఇచ్చారు.అయితే ఇప్పటివరకు ఉన్న మిగతా ఎనిమిది మంది కంటెస్టెంట్లలో టైటిల్ ఫేవరేటుగా నిలిచిన ముగ్గురు పేర్లు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.
ఇకపోతే వైల్డ్ కార్డు ఎంట్రీలు ఇచ్చినా కూడా వారిలో టైటిల్ కొట్టే ఛాన్స్ ఉండదు. ఎందుకంటే వారంతా ఐదు వారాల గేమ్ చూసి వచ్చారు. కాబట్టి ప్రేక్షకుల నుంచి వీరికి పెద్దగా సపోర్ట్ ఉండదు. ఎంత స్ట్రాంగ్ ప్లేయర్ అయినా వైల్డ్ కార్డు కంటెస్టెంట్ కి మాత్రం ఇంతవరకూ టైటిల్ దక్కలేదు. కాబట్టి మొదటి రోజు నుంచి హౌస్ లో కష్టపడుతున్న వారికి మాత్రమే అవకాశం ఉంటుంది.
కాగా ఇప్పటి వరకూ ఆడియన్స్ ను మెప్పించిన ఆ ముగ్గురు కంటెస్టెంట్స్ లిస్టులో మొదట నిఖిల్ పేరు గట్టిగా వినిపిస్తోంది. సీరియల్ నటుడిగా అడుగుపెట్టిన నిఖిల్.. ఫస్ట్ నుంచి తన గేమ్ బాగా ఆడుతూ మంచి ఇమేజ్ను సొంతం చేసుకున్నాడు. పైగా స్ట్రాంగ్ కంటెస్టెంట్ కూడా. అయితే సోనియా వల్ల రెండు వారాలు గేమ్ దెబ్బతిన్నా.. సోనియా వెళ్లాక టైటిల్ కొట్టే సత్తాను తిరిగి పుంజుకుంటున్నాడు.
ఇక టాప్ 3 లో విష్ణుప్రియ కూడా ఉంటుందని అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. బుల్లితెర ఆడియన్స్ లో తెలుగమ్మాయి అయిన విష్ణుకు భారీ ఫేమ్ ఉంది. . కాకపోతే ప్రేరణతో గొడవలు విష్ణుకు నెగిటివ్ ఇమేజ్ తీసుకొచ్చాయి. అలాగే గేమ్ పరంగా కూడా యావరేజ్ గానే ఉంది. ఇటు పృథ్వీ రాజ్ శెట్టి తో లవ్ ట్రాక్ నడుపుతోంది. నామినేట్ అయిన ప్రతిసారి ఓటింగ్ లో టాప్ 3 లో ఉంటున్న విష్ణుప్రియ టైటిల్ విన్నర్ అయ్యే అవకాశాలు కూడా ఉన్నట్లు తెలుస్తోంది.
ఇక సోషల్ మీడియాతో స్టార్ అయి అనూహ్యంగా దూసుకొస్తున్నాడు నబీల్. అతడి గేమ్‌తో ప్రేక్షకులను మెప్పించడంతో.. ఓట్లు కూడా పెద్ద మొత్తంలో పడుతున్నాయి. ముఖ్యంగా ఓటింగ్ లో నిఖిల్, విష్ణుప్రియ తో పోటీపడుతున్నాడు. సామాన్యుడుగా అడుగుపెట్టిన నబీల్ ఇప్పుడు స్టార్ సెలబ్రిటీలతో పోటీ పడుతూ టైటిల్ సొంతం చేసుకునే ప్రయత్నం చేస్తున్నాడు. ఒకవేళ నబీల్ టైటిల్ గెలిచినా కూడా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదన్న వార్తలు వినిపిస్తున్నాయి.