బిగ్ బాస్ సీజన్ 8 విన్నర్ ఓటింగ్ ఎక్సయింటింగ్‌గా సాగుతోంది. రికార్డ్ స్థాయిలో ఓటింగ్ జరుగుతుండటంతో ఫలితాలు వెంటవెంటనే తారుమారవుతున్నాయి. విజేతను తేల్చే ఈ 15వ వారం ఓటింగ్‌లో.. టాప్ 5 ఫైనలిస్ట్‌ల కోసం వారి అభిమానులు పోటీ పడి మరీ ఓట్లు గుద్దుతున్నారు. అయితే బిగ్ బాస్ టైటిల్ రేస్‌లో మొత్తం ఐదుగురు ఉన్నా..పోటీ మాత్రం నిఖిల్-గౌతమ్‌ల మధ్యే అన్నట్లుగా హోరా హోరీగా సాగుతుంది.
అఫీషియల్ ఓటింగ్ ఏంటనేది ఫినాలే నాడే ప్రకటించనున్నారు. కాకపోతే అన్ అఫీషియల్ ఓటింగ్ ప్రకారం తొలిరోజు ఓటింగ్‌లో నిఖిల్ కొన్ని పోల్స్‌లో పైచేయి సాధిస్తే.. గౌతమ్ కృష్ణ మరికొన్ని పోల్స్‌లో పైచేయి సాధించినట్లు తెలుస్తోంది. మొత్తం ఓటింగ్‌లో సుమారు 80 శాతం ఓటింగ్ వీళ్లిద్దరే షేర్ చేసుకుంటున్నారు. దీనిప్రకారం ప్రేరణ, నబీల్, అవినాష్ నామ్ కే వాస్తేగా 20 శాతంలో ఓట్లలో ఉండగా.. వీరిద్దరూ వార్ వన్ సైడ్‌గా ఓట్లను షేర్ చేసుకుంటున్నారు.
ఆదివారం రాత్రి నుంచి ఓటింగ్ లైన్స్ ఓపెన్ అవగా.. తొలిరోజు ఓటింగ్‌కి రెండోరోజు ఓటింగ్‌కి మధ్య భారీ తేడాలు కనిపిస్తున్నాయని తెలుస్తోంది. తొలిరోజు ఓటింగ్‌లో గౌతమ్‌పై నిఖిల్ పైచేయి సాధించినట్టుగా కనిపించగా.. రెండో రోజు ఓటింగ్‌లో అనూహ్యంగా ఈక్వల్‌గా నిలిచారట. తొలిరోజు పోల్ రిజల్ట్‌లో నిఖిల్ 33 శాతం ఓట్లతో టాప్‌లో ఉండగా.. గౌతమ్ మాత్రం 25 శాతం ఓట్లతో సెకండ్ ప్లేస్‌లో కనిపించాడు.
కానీ రెండోరోజు చూస్తే గౌతమ్ 34 శాతం ఓట్లతో టాప్‌లోకి వచ్చేసాడట. నిఖిల్‌కి కూడా 34 శాతం ఓట్లే వచ్చినా.. 67,270 ఓట్లు గౌతమ్‌కి పడగా.. నిఖిల్‌కి 67, 200 ఓట్లు పడటంతో వీరిద్దరికీ కేవలం 70 ఓట్ల వ్యత్యాసంతో గౌతమ్ టాప్‌లోకి వచ్చేశాడు. కాబట్టి.. నిఖిల్, గౌతమ్‌లో విన్నర్ ఎవరనేది మాత్రం.. చివరి క్షణం వరకూ ఉత్కంఠగా మారనుంది.