బిగ్ బాస్ 8 పద్నాలుగో వారం రెండు ఎలిమినేషన్స్ ఉంటాయన్న టాక్ నడిచింది. అయితే ఈ సారి బిగ్ బాస్ ఓటింగ్ స్థానాల్లో చాలా గజిబిజి నెలకొనడంతో ..మధ్యలో ఎలాంటి ఎలిమినేషన్ లేకుండా వీకెండ్‌లోనే ఒకరు ఎలిమినేట్ కానున్నట్లు తెలుస్తోంది. బిగ్ బాస్ 8 సీజన్ క్లైమాక్స్‌కు చేరుకోవడంతో.. మరికొద్ది రోజుల్లో గ్రాండ్ ఫినాలే ద్వారా.. టైటిల్ విన్నర్‌ను ప్రకటిస్తారు. దీంతో ఈ వీక్ ఎలిమినేట్ అయ్యేది ఎవరు, టాప్ 6 కంటెస్టెంట్స్ ఎవరనేది ఆసక్తికరంగా మారింది.
పద్నాలుగో వారం నామినేషన్స్ డైరెక్ట్‌గా జరిగినా.. సేఫ్ టాస్క్ ఒకటి ఇచ్చి ట్విస్ట్ ఇచ్చాడు బిగ్ బాస్ . సేఫ్ నుంచి ఎవరిని తొలగిస్తున్నారో పాయింట్స్ చెప్పడంతో పాటు..వాళ్ల ఫొటో కాలిపోయేలా చేయాలని చెప్పాడు. ఈ టాస్క్ తర్వాత టికెట్ టు ఫినాలే పొందిన మొదటి బిగ్ బాస్ ఫైనల్ కంటెస్టెంట్ అవినాష్ తప్ప.. మిగిలినవారంతా నామినేట్ అయ్యారు.
దాంతో బిగ్ బాస్ 8 ఫైనల్ వీక్ నామినేషన్స్‌లో విష్ణుప్రియ, గౌతమ్, నిఖిల్, రోహిణి, నబీల్, ప్రేరణ ఉన్నారు. వీరికి ఫస్ట్ డే నుంచే ఓటింగ్ పోల్స్ ఓపెన్ అయ్యాయి. అయితే, ఈ బిగ్ బాస్ ఓటింగ్‌లో కంటెస్టెంట్ల స్థానాలు మాత్రం తారుమారవుతున్నాయి. ఒక పోల్‌లో గౌతమ్‌కు 27.85 శాతం ఓటింగ్, 9,329 ఓట్లతో మొదటి స్థానంలో దూసుకుపోతున్నాడు.
నిఖిల్ 21.26 శాతం ఓటింగ్, 7,123 ఓట్లతో రెండో స్థానంలో ఉన్నాడు. అలాగే, ప్రేరణ 15.96 శాతం ఓటింగ్ 5,348 ఓట్లతో మూడో స్థానంలో, జబర్దస్త్ రోహిణి 12.56 శాతం ఓటింగ్ ,4,208 ఓట్లతో నాలుగో స్థానంలో నిలిచారు. ఇక విష్ణుప్రియ ఐదో స్థానం దక్కించుకుని 11.83 శాతం ఓటింగ్, 3,963 ఓట్లు రాగా.. చివరి ఆరో స్థానంలో నబీల్ 10.54 శాతం ఓటింగ్, 3,531 ఓట్లను రాబట్టుకున్నాడు.
అంటే, ఈ ఓటింగ్ పోల్స్ ప్రకారం విష్ణుప్రియ, నబీల్ డేంజర్ జోన్‌లో ఉన్నారు. అయితే, మొన్నటివరకు ఈ వీక్ మధ్యలో ఒక ఎలిమినేషన్, వీకెండ్‌లో మరొకరు ఎలిమినేట్ అవుతారన్న టాక్ నడిచింది. కానీ, అలాంటిదేం లేదనీ.. ఎప్పటిలాగే వీకెండ్‌లో ఒకరు ఎలిమినేట్ కానున్నారని తెలుస్తోంది. అయితే, ఈ వారం బిగ్ బాస్ ఓటింగ్‌లో కంటెస్టెంట్ల స్థానాలు చాలా గందరగోళంగా ఉన్నాయన్న టాక్ నడుస్తోంది.
ఎందుకంటే ఓటింగ్ పోల్స్‌లో గౌతమ్ టాప్‌లో ఉంటే.. అఫిషియల్ ఓటింగ్‌లో మాత్రం నిఖిల్ టాప్ 1లో ఉండగా.. గౌతమ్ టాప్ 2లో ఉన్నాడు. ఈ ఓటింగ్ ప్రకారం విష్ణుప్రియ, నబీల్ డేంజర్ జోన్‌లో ఎలిమినేషన్‌కు దగ్గరగా ఉంటే.. అఫిషియల్ ఓటింగ్ పోల్స్‌లో మాత్రం విష్ణుప్రియ, రోహిణి డేంజర్ జోన్‌లో ఉన్నారు. కొన్ని పోల్స్‌లో చూస్తే.. నబీల్, ప్రేరణ, రోహిణి కూడా డేంజర్ జోన్‌లో ఉన్నట్లే ఉంది.
కాకపోతే అన్ని ఓటింగ్ పోల్స్‌లో కూడా విష్ణుప్రియ డేంజర్ జోన్‌లో ఉండటంతో..ఈ వారం ఆమె ఎలిమినేట్ అయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయన్న వార్తలు వినిపిస్తున్నాయి. ఆమె తర్వాత ఎలిమినేట్ అయ్యే అవకాశం రోహిణికి ఉండటంతో.. ఈ వారం విష్ణుప్రియ , రోహిణిలో ఎవరో ఒకరు ఎలిమినేట్ అవడం పక్కా అన్న కామెంట్లు సోషల్ మీడియాలో వినిపిస్తున్నాయి.