ఓటింగ్‌లో నబీల్ టాప్.. డేంజర్ జోన్‌లో ఎవరెవరున్నారు?

Nabeel Tops The Voting Who Is In The Danger Zone, Nabeel Tops The Voting, Who Is In The Danger Zone, Danger Zone, Top In The Voting, Avinash, Bigg Boss House, Bigg Boss Voting, Gautham, Nabeel, Nikhil, Prerna, Prithvi, Rohini, Tasty Teja, Yashmi, Bigg Boss Elimination, Elimination In This Week,Bigg Boss Telugu 8, Bigg Boss Telugu Season 8, Bigg Boss 8, Bigg Boss Contestants, Bigg Boss Season 8, Movie News, Latest Bigg Boss News, Bigg Boss News Updates, Nagarjuna, Tollywood, Mango News, Mango News Telugu

బిగ్‌బాస్ సీజన్ 8 విజయవంతంగా 11 వారాలు పూర్తి చేసుకుని ..12వ వారంలోకి అడుగుపెట్టింది. మరో మూడు, నాలుగు వారాల్లో బిగ్‌బాస్ 8వ సీజన్‌కు ఎండ్ కార్డ్ పడబోతోంది. లాస్ట్ వీక్ బిగ్ హౌస్‌లో ఎవరూ ఎలిమినేట్ కాకపోవడంతో.. 12వ వారం డబుల్ ఎలిమినేషన్ అవుతారన్న వార్తలు వినిపిస్తున్నాయి. దీంతో ఈ వారం ఎవరు ఎలిమినేట్ అవుతారనేది ఉత్కంఠగా మారింది.

బిగ్‌బాస్ హౌస్లో ఇప్పటి వరకు బెజవాడ బేబక్క, ఆర్జే శేఖర్ భాషా, అభయ్ నవీన్, సోనియా ఆకుల, ఆదిత్య ఓం, నైనిక, కిర్రాక్ సీత, నాగ మణికంఠ, మెహబూబ్, నయని పావని, గంగవ్వ, హరితేజలఎలిమినేట్ అయ్యారు. పాత ఓజీ క్లాన్‌లో నిఖిల్, యష్మిగౌడ, పృథ్వీరాజ్, నబీల్, విష్ణుప్రియ, ప్రేరణ ఉండగా.. రాయల్ క్లాన్‌లో అవినాష్, గౌతమ్, రోహిణి, టేస్టీ తేజ మిగిలారు.

ఇక సోమవారం రోజు నామినేషన్స్ విషయానికి వెళ్తే.. మెగా చీఫ్ అవడంతో.. అవినాష్‌ను ఎవరూ నామినేట్ చేయడానికి వీలులేదని బిగ్ బాస్ చెప్పాండంతో పాటు నబీల్ వల్ల అవినాష్ సేవ్ అయ్యాడు. ఇక ఏ సీజన్‌లోనూ లేని విధంగా 12వ వారం వెరైటీ నామినేషన్స్‌కు శ్రీకారం చుట్టాడు బిగ్ బాస్. దీనిలో భాగంగా ఈ సీజన్‌లో ఇప్పటి వరకు ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్స్‌ ని పిలిపించి..ఒక్కొక్కరు ఇద్దరు ఇంటి సభ్యులను నామినేట్ చేయాలని చెప్పాడు

ముందుగా సోమవారం రోజు సోనియా ఆకుల .. నిఖిల్, ప్రేరణలను నామినేట్ చేసింది. అలాగే ఆర్జే శేఖర్ భాషా.. ప్రేరణ, యష్మీలను నామినేట్ చేయగా.. బెజవాడ బేబక్క.. పృథ్వీ, నిఖిల్‌లని నామినేట్ చేశారు. తొలిరోజు ముగ్గురితో ముగించిన బిగ్‌బాస్.. మంగళవారం నాగ మణికంఠ, కిర్రాక్ సీత, నైనిక, ఆదిత్య ఓంలను హౌస్‌లోకి తీసుకురాబోతున్నాడు. నబీల్, నిఖిల్‌ను నాగ మణికంఠ నామినేట్ చేయగా.. యష్మి, ప్రేరణలను సీత.. నబీల్, యష్మిలను నైనిక నామినేట్ చేసింది.

అయితే సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారాన్ని బట్టి ఈ వారం నామినేషన్స్‌లో ఐదుగురు ఉన్నట్లు తెలుస్తోంది. నబీల్, యష్మి, పృథ్వీరాజ్, నిఖిల్, ప్రేరణ నామినేషన్లలో ఉండగా.. ఆన్‌లైన్‌లో అనధికారిక ఓటింగ్ ప్రకారం.. నబీల్ దాదాపు 34 శాతం ఓటింగ్‌తో టాప్‌లో ఉన్నట్లు తెలుస్తోంది. కొద్దివారాలుగా ఓటింగ్‌లో వెనుక బడుతున్న నిఖిల్ ఈసారి కూడా 27 శాతం ఓటింగ్‌తో సెకండ్ ప్లేస్‌లోనే ఉండిపోయాడు. నిఖిల్ తర్వాత ప్రేరణ 16 శాతం, పృథ్వీరాజ్ 14 శాతం, యష్మి 11 శాతం ఓటింగ్‌తో నిలిచినట్లు వార్తలు షికార్లు చేస్తున్నాయి.