ప్రజల నడుమ తిరిగి వారి జీవితాలను దగ్గరగా చూసేందుకు రాజులు, మహారాజులు తమ కాలంలో వ్యాపారులు, సామాన్యుల వేషాలు వేసుకుని వీధుల్లో తిరిగేవారు. ఇప్పుడు ఆ సాధ్యం కాకపోయినా, కొంతమంది సెలబ్రిటీలు అప్పుడప్పుడు మారువేషాల్లో ప్రజల్లోకి వెళ్తుంటారు. ముఖ్యంగా సినీ నటులు థియేటర్లకు భిన్నమైన గెటప్‌లో వెళ్లడం, క్రికెటర్లు మారువేషాల్లో జనాల మధ్య కలవడం తరచుగా జరుగుతుంది. తాజాగా, బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్షనిస్ట్ అమీర్ ఖాన్ ముంబై వీధుల్లో బిచ్చగాడిలా తిరిగిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
అమ్మో.. రాతి యుగపు వ్యక్తిలా మారిన అమీర్ ఖాన్!
పొడవాటి గడ్డం, చిందరవందరగా పెరిగిన జుట్టు, జంతు చర్మాన్ని పోలిన దుస్తులు, కాళ్లకు బూట్లు – ఇలా ఒక రాతి యుగపు మనిషిలా మారిన వ్యక్తి ముంబై వీధుల్లో సంచరిస్తున్నాడు. చేతిలో ఒక హ్యాండ్‌కార్ట్‌ను లాగుతూ, రోడ్‌సైడ్ షాపుల వద్ద ఆహారం అడుగుతున్నాడు. అతని వేషధారణ చూసి కొందరు భయపడిపోగా, మరికొందరు ఆశ్చర్యపోయారు. అయితే ఈ వ్యక్తి ఎవరో తెలుసుకున్నాక మాత్రం అందరి ఫ్యూజులు ఎగిరిపోయాయి!
ఆ వ్యక్తి మరెవరో కాదు, బాలీవుడ్ స్టార్ అమీర్ ఖాన్! బిచ్చగాడిలా మారి ముంబై వీధుల్లో తిరిగిన అమీర్ ఖాన్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో, మొదట్లో ఎవరికీ అర్థం కాలేదు. కొంతమంది ‘ఇది సినిమా కోసమా? లేక మరేదైనా ప్రకటనా?’ అని ఊహించగా, మరికొందరు ‘ఇలా ఎందుకు చేస్తున్నాడు?’ అంటూ ఆశ్చర్యపడ్డారు. చివరకు, అమీర్ ఖాన్ మేకప్ వేసుకుంటున్న వీడియో బయటకు రావడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది.
అమీర్ ఖాన్ ఇలా మారువేషాల్లో తిరగడం ఇదే మొదటిసారి కాదు. గతంలోనూ అతను సౌరవ్ గంగూలీ ఇంటికి మారువేషంలో వెళ్లాడు. సినిమాల కోసం గెటప్ మార్చుకోవడం, రియాలిటీ షో కోసం జనాల్లో కలవడం అతనికి కొత్త కాదు. అయితే ఈసారి ముంబై వీధుల్లో బిచ్చగాడిలా తిరిగిన కారణం మాత్రం ఇంకా స్పష్టంగా తెలియదు. ఈ ప్రయోగం వెనుక ఏదైనా కొత్త సినిమా ఉందా? లేక మార్కెటింగ్ స్టంట్ మాత్రమేనా? తెలియాల్సి ఉంది.
To Ye Caveman Amir Khan Tha BC 😲😲
But Why ? pic.twitter.com/fRgDB6cEhr
— POSITIVE FAN (@imashishsrrk) January 29, 2025
Aamir Khan’s Caveman Transformation Video Takes the Internet by Storm .#AamirKhan #Caveman #Mumbai #bollywood #ViralVideo pic.twitter.com/NBZsxsBHWA
— Circle Of Bollywood (@CircleBollywood) January 30, 2025