బెంగళూరు రేవ్ పార్టీ డ్రగ్స్ కేసులో తన పేరును పోలీసులు ఛార్జిషీట్‌లో పెట్టడంపై నటి హేమ స్పందించారు. ఓవైపు తాను డ్రగ్స్ తీసుకోలేదని.. తనకు గుడ్ న్యూస్ వచ్చిందని హేమ పేర్కొంటే.. మరోవైపుపోలీసులు డ్రగ్స్ తీసుకున్న వారి పేర్లను ప్రస్తావిస్తూ.. పోలీసులు చార్జ్ షీట్ వేయటం ఇప్పుడు సంచలనంగా మారింది. తాజాగా హేమ స్పందిస్తూ మీకో గుడ్ న్యూస్ చెప్పాలనుకుంటున్నానని, తన బ్లడ్ శాంపిళ్లలో డ్రగ్స్ నెగటివ్ వచ్చినట్టు తన లాయర్ ఫోన్ చేసి చెప్పారని అందులో హేమ పేర్కొన్నారు. పోలీసులు సమర్పించిన చార్జ్‌షీట్‌లో ఈ విషయాన్ని పేర్కొన్నారని చెప్పారని అన్నారు. తన రక్తంలో డ్రగ్స్ ఆనవాళ్లు లేవన్న సంగతిని గతంలోనే మీతో పంచుకున్నానని, ఏ టెస్టులకైనా రెడీ అని అప్పుడే చెప్పానని గుర్తు చేసుకున్నారు. ఇప్పుడు చార్జ్‌షీట్‌లో కూడా పోలీసులు అదే విషయాన్ని పేర్కొన్నారని, ఈ విషయాన్ని మీతో పంచుకుంటున్నందుకు ఆనందంగా ఉందని హేమ పేర్కొన్నారు. తనకు ఉన్న సమాచారం మేరకు డ్రగ్స్ రిపోర్ట్‌లో నెగిటివ్ అని ఛార్జిషీట్‌లో వేసినట్లు తెలుస్తుందని అన్నారు.
బెంగుళూర్ రేవ్ పార్టీ కేసులో నటి హేమ బెంగళూరు రేవ్ పార్టీలో డ్రగ్స్ తీసుకున్నారని పోలీసులు స్టేట్మెంట్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఆమె ఎండీఎంఏ తీసుకున్నట్లుగా ఆధారాలు సేకరించి మెడికల్ రిపోర్టులను కూడా జత చేశారు. ఇప్పటికే ఈ కేసులో మొత్తం 88 మంది నిందితులను చేర్చారు. ఈ కేసుకు సంబంధించి బెంగళూర్ పోలీసులు 1,086 పేజీల ఛార్జ్‌షీట్‌ను దాఖలు చేశారు.
ఇది ఇలా ఉండగా.. బెంగళూర్ రేవు పార్టీలో హేమ డ్రగ్స్ తీసుకున్నారనే అబియోగంతో ఆమె పై కేసు నమోదు చేయగా.. నటి హేమ మాత్రం తాను ఎలాంటి డ్రగ్స్ తీసుకోలేదని, కేసు నుంచి తనకు మినహాహింపు ఇవ్వాలని బెంగళూర్ కోర్టును ఆశ్రయించింది. దీంతో ఇరు పక్షాల వాదోపవాదనలు విన్న కోర్టు హేమకు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. ఈ క్రమంలో మళ్ళీ రేవు పార్టీ కేసులో హేమ డ్రగ్స్ తీసుకున్నట్లు పోలీసులు ఇచ్చిన స్టేట్మెంట్ సంచలనంగా మారింది.