‘మయోసైటిస్’ వ్యాధితో బాధపడుతున్నానని తెలిపిన ప్రముఖ నటి సమంత, త్వరలోనే కోలుకుంటానని వెల్లడి

Actress Samantha Reveals That She has been Diagnosed with Autoimmune Condition called Myositis, Actress Samantha, Tollywood Actress Samantha, Samantha Autoimmune Condition, Mango News, Mango News Telugu, Samantha Latest News And Updates, Autoimmune Condition Samantha,Actress Samantha Myositis, Samantha Diagnosed With Myositis, Actress Samantha Myositis, Myositis latest News And updates, Samantha New Movie Updates

ప్రముఖ నటి సమంతా రూత్ ప్రభు అనారోగ్యం బారిన పడ్డారు. ఈ మేరకు ఆమె స్వయంగా సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ ఇన్‌స్టాగ్రామ్ వేదికగా ప్రకటించారు. తాను ‘మయోసైటిస్’ అనే వ్యాధితో బాధపడుతున్నానని పేర్కొన్నారు. ఆమె ప్రధాన పాత్రలో నటించిన ‘యశోద’ చిత్రం త్వరలో విడుదలకు సిద్దమవుతున్న క్రమంలో డబ్బింగ్ చెబుతున్న సందర్భంగా తీసిన ఒక ఫోటోను కూడా పోస్ట్ చేశారు. ఆ ఫోటోలో సమంత చేతికి సెలైన్ పెట్టి ఉండటం కనిపిస్తోంది. కాగా గత కొంతకాలంగా సమంత అమెరికాలో చికిత్స తీసుకుంటున్నట్లు వారట్లు వస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సమంతానే స్వయంగా ఈ వార్తలపై స్పందించింది. తాను ‘మయోసైటిస్’ వ్యాధితో బాధపడుతున్నానని, ప్రస్తుతం దీనికి చికిత్స తీసుకుంటున్నానని తెలిపారు. అలాగే దీనిని అధిగమిస్తామని, త్వరలోనే కోలుకుంటానని ఆశాభావం వ్యక్తం చేశారు. దీని గురించి తెలుపుతూ సమంత ఇన్స్టాలో ఒక పోస్ట్ పెట్టింది.

‘యశోద ట్రైలర్‌కి మీ స్పందన చాలా బాగుంది. మీ అందరితో నేను పంచుకునే ఈ ప్రేమ మరియు అనుబంధమే, జీవితం నాపై విసిరే అంతు లేని సవాళ్లను ఎదుర్కోవడానికి నాకు శక్తిని ఇస్తుంది. గత కొన్ని నెలల క్రితం నేను మయోసైటిస్ అనే ఆటో ఇమ్యూన్ కండిషన్‌తో బాధపడుతున్నాను. ప్రస్తుతం దీనికి చికిత్స తీసుకుంటున్నాను. ఇప్పుడు నా ఆరోగ్యం నిలకడగా ఉంది. దీనినుంచి కోలుకుంటున్నా. కానీ నేను ఆశించిన దానికంటే కొంచెం ఎక్కువ సమయం పడుతోంది. మనం ఎల్లప్పుడూ బలమైన ముందంజ వేయాల్సిన అవసరం లేదని నేను నెమ్మదిగా గ్రహించాను. జీవితంలో ఎదురయ్యే ప్రతిదానిని స్వీకరిస్తూనే న పోరాటాన్ని కొనసాగిస్తాను. త్వరలోనే నేను పూర్తిగా కోలుకుంటానని వైద్యులు విశ్వసిస్తున్నారు. శారీరకంగా మరియు మానసికంగా నేను మంచి రోజులు, చెడు రోజులు అన్నింటినీ చూసాను. ఇలాంటి పరిస్థితులను ఒక్కరోజు కూడా భరించలేనేమో అని అనుకున్నాను, కానీ ఏదో ఒకవిధంగా ఆ క్షణాలు గడిచిపోయాయి. నేను పూర్తిగా కోలుకునే రోజు అతి దగ్గరలోనే ఉంది. ఐ లవ్ యూ’ అని పేర్కొన్నారు.

మయోసైటిస్ అంటే ఏమిటి? దీని లక్షణాలు ఎలా ఉంటాయి?

సమంతకు ఉన్నట్లు నిర్ధారణ అయిన ఈ మయోసైటిస్ అనేది అరుదుగా వచ్చే ఒకరకమైన వ్యాధి. ఈ వ్యాధిలో పలు రకాలు ఉన్నాయి. ఇది రోగనిరోధక వ్యవస్థ కండరాలపై దాడి చేసి కండరాలలో మంటకు దారితీస్తుంది. డెర్మాటోమియోసైటిస్, పాలీమయోసైటిస్ మరియు ఇన్‌క్లూజన్ బాడీ మైయోసైటిస్ వంటి ఇన్ఫ్లమేటరీ పరిస్థితులు తీవ్రమైన మైయోసైటిస్‌కు కారణం కావచ్చు. అలాగే లూపస్, స్క్లెరోడెర్మా మరియు రుమటాయిడ్ ఆర్థరైటిస్ కూడా ఈ పరిస్థితికి కారణం కావచ్చు. ఇక దీనివలన కండరాలలో నొప్పి మరియు బలహీనత ఉంటుంది. ఇది కాలక్రమేణా మరింత తీవ్రమవుతుంది. దీనితో బాధపడేవారు ఒక్కోసారి తెలియకుండానే కింద పడిపోవచ్చు. శరీరంపై దద్దుర్లు, అలసట, చేతులపై చర్మం గట్టిపడటం, మింగడం మరియు శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది వంటి లక్షణాలు ఉంటాయి. ఈ వ్యాధి బారిన పడినవారు కోలుకునే సమయం ఒక్కోలా ఉంటుంది. ఆ వ్యక్తులలో ఉన్న ఇమ్మ్యూనిటీని బట్టి దీని తీవ్రతలో హెచ్చుతగ్గులు కనిపిస్తుంది.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

5 × one =