డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణం కోసం కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి. కిషన్‌రెడ్డి ఆధ్వర్యంలో నవంబర్ 25, 26, 27 తేదీల్లో ‘హైదరాబాద్ వాక్స్ ఫర్ నషా ముక్త్ భారత్’ పేరిట భారీ పాదయాత్ర జరగనుంది. నగరంలోని అంబర్‌పేట నుండి జూబ్లీహిల్స్ వరకు మూడు రోజుల పాటు దాదాపు 29 కిలోమీటర్ల మేర ఈ యాత్ర కొనసాగనుంది.
మూడు రోజుల పాదయాత్ర రూట్ మ్యాప్:
-
మొదటి రోజు (నవంబర్ 25 – 11.2 కి.మీ): అంబర్‌పేట మున్సిపల్ గ్రౌండ్‌లో పాదయాత్ర ప్రారంభమవుతుంది. ఛే నంబర్ జంక్షన్, ఓయూ గేట్, ఆర్ట్స్ కాలేజీ, సీతాఫల్‌మండి చౌరస్తా, చిలకలగూడ చౌరస్తా, గాంధీ ఆసుపత్రి మీదుగా సాగి ముషీరాబాద్ చౌరస్తా వద్దకు చేరుకుంటుంది.
-
రెండవ రోజు (నవంబర్ 26 – 10.9 కి.మీ): ముషీరాబాద్ నుండి మొదలై ఆర్టీసీ క్రాస్‌రోడ్డు, అశోక్‌నగర్ చౌరస్తా, హిమాయత్‌నగర్ చౌరస్తా, లిబర్టీ అంబేడ్కర్ విగ్రహం, బడా గణేష్, ఖైరతాబాద్ చౌరస్తా, ఇమేజ్ ఆసుపత్రి లేన్ మీదుగా ప్రయాణించి అమీర్‌పేట సత్యం థియేటర్ వద్ద ముగుస్తుంది.
-
మూడవ రోజు (నవంబర్ 27 – 7.7 కి.మీ): మైత్రీవనం నుండి ప్రారంభమై యూసుఫ్‌గూడ చెక్‌పోస్టు, ఇందిరానగర్ చౌరస్తా, జగన్నాథస్వామి ఆలయం, భారతీయ విద్యాభవన్ మీదుగా సాగి జూబ్లీహిల్స్ పబ్లిక్ స్కూల్‌కు చేరుకుంటుంది. ముగింపు సందర్భంగా అక్కడ ప్రత్యేకంగా ‘సంకల్ప సభ’ నిర్వహిస్తారు.
పాదయాత్రకు మద్దతు తెలిపిన ప్రముఖులు:
ఈ మహా ప్రజా ఉద్యమంలో భాగస్వాములు కావాలని కిషన్‌రెడ్డి వివిధ రంగాల ప్రముఖులను స్వయంగా కలిసి ఆహ్వానించారు:
-
సినీ ప్రముఖులు: మెగాస్టార్ చిరంజీవి, కింగ్ అక్కినేని నాగార్జున, విక్టరీ వెంకటేశ్, ప్రముఖ దర్శకులు సుకుమార్, బోయపాటి శ్రీనులను కిషన్‌రెడ్డి కలిసి పాదయాత్రకు ఆహ్వానించారు. నాగార్జున మరియు వెంకటేశ్ ఈ యాత్రకు సంబంధించిన ప్రత్యేక టీ-షర్టులను ఆవిష్కరించి, డ్రగ్స్ రహిత సమాజం కోసం తమ సంపూర్ణ మద్దతు ఎల్లప్పుడూ ఉంటుందని ప్రకటించారు.
-
మేధావులు, రాజకీయ నాయకులు: సన్నాహక సదస్సులో లోక్‌సత్తా వ్యవస్థాపకులు డాక్టర్ జయప్రకాశ్ నారాయణ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రామచందర్‌రావు, ఎంపీ డాక్టర్ కె. లక్ష్మణ్ తదితరులు పాల్గొని యువతలో చైతన్యం నింపారు. వీరితో పాటు పలువురు సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లు, విద్యావేత్తలు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు ఈ పాదయాత్రలో పాల్గొని సంఘీభావం తెలుపుతున్నారు.







































