నాగ చైతన్య, సమంత జంట వీడిపోతారని ముందుగానే చెప్పి సంచలనం సృష్టించిన జ్యోతిష్యుడు వేణు స్వామి మరోసారి నాగ చైతన్య పర్శనల్ లైఫ్ పై కామెంట్స్ చేశాడు. ప్రస్తుతం నాగ చైతన్య, శోభితల ఎంగేజ్‌మెంట్ సోషల్‌మీడియాలో రచ్చ రచ్చ చేస్తున్న సంగతి అందరికి తెలిసిందే. నేషనల్ వైడ్‌గా ట్రెండ్ అవుతూ ప్రతి ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. ఈ తరుణంలో నే వేణు స్వామి సెన్సెషన్ ల్ కామెంట్స్ చేశాడు. నాగచైతన్య, శోభితల ఇరువురి జాతకంపై వీడియో రిలీజ్ చేశాడు. ఇందులో వారి జాతకం బాలేదంటూ కామెంట్స్ చేశాడు. సమంత కంటే శోభిత జాతకం ఏమాత్రం బాగాలేదని, 2027 వరకు బాగానే ఉన్నా ఈ మూడేళ్ల తర్వాత చైతూ, శోభితకు ఒక స్త్రీ మూలంగా సమస్యలు, గొడవలు వస్తాయన్నాడు. అంతేకాక వీరు ఎంగేజ్‌మెంట్ చేసుకున్న ముహుర్తం, పుట్టిన నక్షత్రం వివరాలు చూస్తుంటే వారు ఏమాత్రం కలిసి ఉండలేరని, కచ్చితంగా విడిపోతారని వేణు స్వామి చెప్పాడు.
నాగ చైతన్య రాశి కర్కాటక రాశి. శోభిత ధూళిపాళది ధనుస్సు రాశి అని అందులో నాగ చైతన్యకు 6, శోభితకు 8 పాయింట్లు వచ్చాయన్నారు. శోభిత జాతకంలో శని దృష్టి కుజుడితో పాటు శుక్రుడు, గురుడుల మీద ఉందన్నారు. ఇద్దరి జాతకాల్లో షష్టాకాలు వచ్చాయని అన్నాడు. నేను కావాలని, తెలియకుండా చెప్పడంలేదని నేను చెప్పిన జాతకం ఫెయిల్ అవ్వాలని కోరుకుంటున్నా అని అన్నారు. తెలంగాణలో కేసీఆర్, ఏపీలో జగన్‌లు సీఎం అవుతారని చెప్పిన వేణు స్వామి జాతకం తప్పని తేలాయి. దీంతో ఆయనపై నెటిజన్లు ఓ రేంజ్‌లో ఫైర్ అయ్యారు. దీంతో ఇక మీదట తాను ప్రిడిక్షన్ చెప్పనని అన్నారు. ఒకపక్క ఆయన జాతకాలు ఫెయిల్ అవుతున్నాయని తెలిసినిప్పటికి కూడా సెలబ్రిటీలు ఆయన్ను మాత్రం వదలడం లేదు.
ఇదిలా ఉంటే సమంతతో విడాకుల తీసుకున్న తర్వాత హీరోయిన్ శోభిత ధూళిపాళతో నాగ చైతన్య సైలెంట్‌గా రిలేషన్‌ను కొనసాగించారు. తాజాగా వీరిద్దరు తమ బంధాన్ని బహిర్గతం చేశారు. గురువారం శోభితతో నాగ చైతన్య నిశ్చితార్థం చేసుకున్నాడు. ఈ విషయాన్ని నాగార్జున అధికారికంగా ప్రకటించారు. కాగా వేణు స్వామి ఇప్పుడు ఇలా ప్రకటించడంతో అక్కినేని అభిమానుల్లో కొత్త అనుమానం మొదలైంది. గతంలో సమంత , నాగ చైతన్య విడిపోతారంటూ మొట్ట మొదటగా చెప్పింది వేణు స్వామినే. దీంతో ఇప్పుడు శోభిత, నాగ చైతన్యల జీవితం గురించి ఎలాంటి కామెంట్స్ చేస్తారో అని అభిమానులు ఆందోళన చెందుతున్నారు.