నందమూరి బాలకృష్ణ సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి 50 ఏళ్లు పూర్తయిన సందర్భంగా జరిగిన స్వర్ణోత్సవ వేడుకల్లో మెగాస్టార్ చిరంజీవి ఆశక్తికర కామెంట్స్ చేశారు. తాను ఇంద్ర సినిమా చేయడానికి ఆదర్శం సమర సింహా రెడ్డి అని పేర్కొన్నారు. తాను ఫ్యాక్షన్ సినిమా చేయడానికి బాలకృష్ణ ఆదర్శమని మెగాస్టార్ చిరంజీవి అన్నారు. ‘సమరసింహారెడ్డి’ సినిమా స్ఫూర్తితోనే తాను ‘ఇంద్ర’ సినిమా చేశానని చెప్పారు. బాలకృష్ణతో కలిసి ఒక ఫ్యాక్షన్ మూవీ చేయాలనే కోరిక తనకు ఉందని, కచ్చితంగా చేస్తానని తన మనసులోని ఆకాంక్షను వెల్లడించారు. అంతేకాదు ఈమధ్య సీక్వెల్స్, ప్రీక్వెల్స్ వస్తున్నాయి కాబట్టి ఇంద్రసేనా రెడ్డి వర్సెస్ సమర సింహా రెడ్డి కథ వస్తే బాగుంటుందని. బోయపాటి శ్రీను, చౌదరి లాంటి వారు ఇది ప్లాన్ చేయాలని అన్నారు. బాలయ్య రెడీ అంటె తాను కూడా రెడీ అని అన్నారు చిరంజీవి.
బాలయ్య 50 సంవత్సరాల వేడుకకు రావడం చాలా ఆనందంగా అన్నారు చిరు. అలాగే ఇది బాలయ్యకు మాత్రమే కాదు, తెలుగు చలన చిత్రాని కే ఒక వేడుకలా అనిపిస్తుంది. ఈ అరుదైన రికార్డు బాలకృష్ణ సొంతం చేసుకున్నందుకు సంతోషంగా ఉందని అన్నారు మెగాస్టార్ చిరంజీవి. నందమూరి తారకరామారావు గారిని తెలుగు ప్రజల మదిలో ప్రత్యేక స్థానం ఉంది. ఆయన కొడుకుగా తండ్రి చేసిన పాత్రలు చేస్తూ.. ప్రేక్షకులను ఆకట్టుకోవడం అనేది మాములు విషయం కాదని చిరంజీవి అన్నారు.
అంతే కాదు ఫ్యాన్స్ వార్ గురించి చిరు ప్రస్తావించారు. మాములుగా ఫ్యాన్స్ మధ్య గొడవలు జరుగుతుంటాయి. తను సినిమాల్లోకి రాకముందు ఫ్యాన్స్ మధ్య చిన్న చిన్న గొడవలు చూశాను. స్టార్స్ మధ్య స్నేహ బంధం ఉంటుంది. అలానే ఫ్యాన్స్ కూడా అలానే కలిసి మెలిసి ఉండాలని కోరారు చిరంజీవి. మా మధ్య ఎలాంటి బంధం ఉందో ఫ్యాన్స్ కు తెలియడానికి ఇలా కొన్ని వేడుకలు చేసుకునే వాళ్ళం అన్నారు చిరు. నా ఇంట్లో ఏదైనా శుభకార్యం జరిగితే బాలయ్య తప్పకుండా వస్తారు. మా ఇంట్లో జరిగే ఈవెంట్లకు వచ్చి తమతో కలిసి డ్యాన్స్ కూడా వేస్తారని చిరు అన్నారు.
బాలయ్య రాజకీయ వైద్య రంగాలలో ఇలా సేవ చేయడం న భూతో న భవిష్యత్..భగవంతుడు బాలయ్యకు ఇదే ఎనర్జీ ఇస్తూ 100 ఏళ్లు బావుండాలని ఆ భగవంతుడిని కోరుకుంటున్నానని అన్నారు. కాగా లాంగ్ లివ్ బాలయ్య అంటూ చిరంజీవి ఉద్వేగంగా ప్రసంగించారు. అయ్యప్ప మాలతో వచ్చిన ఆయనను బాలయ్య ఆనందంగా రిసీవ్ చేసుకొన్నారు. కాగా బాలయ్య స్వర్ణోత్సవ వేడుకల్లో సినీపరిశ్రమ ఆయనను ఘనంగా సత్కరించింది. ఈ స్వర్ణోత్సవ వేడుకకు సినీ, రాజకీయ ప్రముఖులు తరలి వచ్చారు. లీవుడ్ నుంచి మాత్రమే కాదు కన్నడ ఇండస్ట్రీ నుంచి కూడా పలువురు స్టార్స్ ఈ ఈవెంట్ కు హాజరయ్యారు. అలాగే ఈ ఈవెంట్ చిరంజీవి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. చిరంజీవితో పాటు వెంకటేష్, మోహన్ బాబు, శివ రాజ్ కుమార్, ఉపేంద్ర సహా పలువురు యంగ్ హీరోలు కూడా హాజరయ్యారు.