నందమూరి ఫ్యామిలీ హీరోగా ఎంట్రీ ఇచ్చిన జూనియర్ ఎన్టీఆర్..కొద్దిరోజుల్లోనే తనదైన రీతిలో సత్తా చాటుకుంటూ ఇండస్ట్రీలో ముందుకు దూసుకెళ్తున్నాడు. ఇక ప్రస్తుతం నందమూరి ఫ్యామిలీ బాధ్యతల మొత్తాన్ని కూడా తనే మోస్తూ ముందుకు సాగుతున్నాడు. ఇప్పటివరకు వరుసగా ఏడు సినిమాలతో సూపర్ సక్సెస్ లను సాధించిన ఎన్టీఆర్.. ఇక రాబోయే సినిమాలతో కూడా వరుసగా బ్లాక్ బస్టర్లను అందుకోవాలనే టార్గెట్‌తో ముందుకు సాగుతున్నాడు.
మరోవైపు రీసెంట్ గా ఎన్టీఆర్ బావమరిది నార్నే నితిన్ హీరోగా వచ్చిన మ్యాడ్ స్క్వేర్ .. రీసెంట్ గా రిలీజ్ హిట్ టాక్‌తో హౌజ్ ఫుల్ కలెక్షన్స్‌తో దుమ్ము రేపుతోంది. దీంతో ఈ సినిమాకు సంబంధించిన సక్సెస్ పార్టీని ఏర్పాటు చేయగా. ఆ ఈవెంట్ కి జూనియర్ ఎన్టీఆర్ చీఫ్ గెస్ట్ గా వచ్చాడు.
ఈ ఈవెంట్లో తారక్‌ను చూసిన నందమూరి అభిమానులందరూ ఒక్కసారిగా ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే జూనియర్ ఎన్టీఆర్ మొదట్లో లావుగా ఉన్నా రాఖీ సినిమా తర్వాత బాగా సన్నబడ్డాడు. మళ్లీ ఆ తర్వాత మళ్లీ లావుగా అయిపోయాడు. ఇప్పుడు మ్యాడ్ స్క్వేర్ ఈవెంట్లో చాలా సన్నంగా అయిపోవడంతో అభిమానులు షాక్ అయ్యారు. అదేంటి ఈ మధ్యే లావుగా ఉన్న ఎన్టీఆర్ మళ్లీ ఇంతగా ఎలా సన్నం అయ్యాడంటూ ఆశ్చర్యపోతున్నారు. అయితే ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో చేస్తున్న సినిమా కోసమే ఎన్టీఆర్ ఇలా సన్నబడినట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి.
మరోవైపు ఇలా సన్నబడిన ఎన్టీఆర్ గురించి సోషల్ మీడియాలో పెద్ద చర్చే జరుగుతుంది. ఎన్టీఆర్ ఇంతకుముందు కండలు తిరిగిన బాడితో ఉన్నప్పుడే చాలా అందంగా ఉన్నాడని.. ఇప్పుడు చాలా సన్నబడిపోవడంతో హీరో లుక్స్ లేవని కొంతమంది కామెంట్లు పెడుతున్నారు. అయితే మరి కొంతమంది మాత్రం స్లిమ్ గా మారిన ఎన్టీఆర్ ను చూసి చాలా అందంగా ఉన్నాడని… ఎన్టీఆర్ ఇలా ఉంటేనే బాగుంటాడని కామెంట్లు చేస్తున్నారు.ఇంతగా సన్నం అవడానికి ఏం చేశావన్నా అంటూ ఎన్టీఆర్‌ను ప్రశ్నిస్తున్నారు.