రెబల్ స్టార్ ప్రభాస్ బర్త్ డే సందర్భంగా ‘ది రాజా సాబ్’ మేకర్స్ మోషన్ పోస్టర్ రిలీజ్ చేశారు. అందులో ప్రభాస్ ఎప్పుడూ చూడని విధంగా సరికొత్తగా కనిపించారు. ఇందులో ప్రభాస్ సింహాసనంపై కూర్చొని సిగార్ కాలుస్తూ రాజు లుక్‌లో కనిపించారు. బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ కూడా ఆకట్టుకునేలా సాగింది. అంతకుముందు రోజు విడుదల చేసిన పోస్టర్లో గళ్ల చొక్కా, కళ్లద్దాలు పెట్టుకుని స్టైల్‌గా నడుస్తూ కనిపించారు ప్రభాస్.
ఈ రొమాంటిక్ హారర్ కామెడీ సినిమాకు మారుతీ దర్శకత్వం వహిస్తున్నారు. ప్రముఖ దర్శకుడు మారుతి డైరెక్షన్‌లో హారర్ కామెడీ జానర్‌లో రాజాసాబ్ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే చాలావరకు షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ మూవీ.. మిగిలిన చిత్రీకరణను వీలైనంత త్వరగానే పూర్తి చేసే పనిలో చిత్ర బృందం ఉంది.
ప్రభాస్‌తో పాటు నిధి అగర్వాల్, మాళవిక మోహనన్, రిద్ధి కుమార్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. బాలీవుడ్ సీనియర్ స్టార్ హీరో సంజయ్ దత్ కీలక పాత్రలో నటిస్తున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ నిర్మిస్తోంది. టీజీ విశ్వప్రసాద్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. మూవీ బడ్జెట్ దాదాపు రూ. 200 కోట్లపైనే అని టాలీవుడ్ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. తమన్ స్వరాలు సమకూరుస్తున్నాడు. తెలుగు సహా హిందీ, తమిళం, మళయాలం, కన్నడ భాషల్లో పాన్ఇండియా లెవెల్లో ఈ చిత్రం తెరకెక్కుతోండగా, వచ్చే ఏడాది ఏప్రిల్ 10న విడుదల కానుంది.
ప్రభాస్ రాజాసాబ్‌తో పాటు, హను రాఘవపూడి దర్శకత్వంలో ఫౌజీ అనే పీరియాడికల్ లవ్ స్టోరీ, సందీప్ వంగాతో స్పిరిట్ అనే మూవీ చేస్తున్నారు. వీటితో పాటే కల్కి, సలార్ సీక్వెల్‌లలోనూ ప్రభాస్ హీరోగా నటిస్తున్నారు. ఈ సినిమాలతో పాటు హనుమాన్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ డైరెక్షన్‌లో ఓ మూవీకి గ్రీన్‌సిగ్నల్ ఇచ్చినట్లు ప్రచారం సాగుతోంది.