మళ్లీ పెళ్లి చేసుకున్న సన్నీ లియోన్..

Sunny Leone Married Again

ఒకప్పటి అడల్ట్ స్టార్ బాలీవుడ్ బ్యూటీ సన్నీ లియోన్ మళ్లీ పెళ్లి చేసుకుంది. ఎంటీ సన్నిలియోన్ తన భర్త డానియల్ వెబర్ కు ఎప్పుడు విడాకులు ఇచ్చింది. మళ్లీ ఎప్పుడు పెళ్లి చేసుకుంది అనేగా మీ డౌటు. కాని సన్నీ రెండో సారి కూడా పెళ్లి చేసుకుంది తన భర్త డానియల్ వెబర్ నే.. విచిత్రంగా అనిపిస్తున్నప్పటికి ఇదే నిజం. పెళ్లై దశాబ్థకాలం పూర్తి చేసుకున్న సన్నీ లియోన్ పెళ్లయిన 13 ఏళ్ల తర్వాత అక్టోబర్ 31, 2024న తన భర్తతో వివాహ ప్రమాణాలను పునరుద్ధరించుకుంది. అంటే రెండోసారి ఆమె తన భర్త డేనియల్‌ తిరిగి వివాహం చేసుకుంది.

సన్నీ-డేనియల్ తమ ప్రమాణాలను పునరుద్ధరించుకోవాలని చాలా కాలంగా కోరుకుంటున్నప్పటికీ.. వారి పిల్లలు నిషా, నోహ్, ఆషర్ ఈ సందర్భం ప్రాముఖ్యతను గ్రహించేంత వయస్సు వచ్చే వరకు కావాలని నిరీక్షించినట్లు తెలిసింది. పిల్లలకు సెలవులు ఉన్న సమయంలోనే ఈ ఈవెంట్ వారు ప్లాన్ చేసుకున్నారు. ఈ జంట పిల్లల్లో ప్రేమ, కుటుంబ ఐక్యత విలువలను పెంపొందించడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలుస్తోంది.

ఈ కార్యక్రమం మాల్దీవుల్లో జరిగింది. ఇద్దరూ పెళ్లి డ్రస్ లో అదరగొట్టారు. ఈ వేడుకలో తన ముగ్గురు పిల్లలు నిషా, నోహ్, ఆషెర్‌ వివాహ వేడుకకు సాక్షులుగా ఉన్నారు. వాస్తవానికి నిషాను ఈ జంట దత్తత తీసుకుంది. ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇందులో ఫ్యామిలీ మెుత్తం వైట్ దుస్తులు ధరించి కనిపించారు. వీటిని చూసిన సన్నీ ఫ్యాన్స్ తెగ కుషీ అవుతున్నారు.

ఈ రోజుల్లో సెలబ్రిటీ జంటలు ఎక్కువగా విడాకులు తీసుకుంటున్న వార్తలు తరచుగా చూస్తున్న వేళ సన్నీ రెండవ సారి భర్తను పెళ్లాటంతో ఆమె ఫ్యామిలీకి ఇస్తున్న కమిట్మెంట్ పై చాలా మంది హర్షం వ్యక్తం చేస్తున్నారు. బాలీవుడ్ లో వరుసగా సినిమాలు చేస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంది ఈ ముద్దుగుమ్మ. హిందీలో స్పెషల్ సాంగ్స్ తో పాటు బోల్డ్ పాత్రల్లో నటించిన ఈ అమ్మడు.. విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా సొంతం చేసుకుంది. అలాగే సన్నీ లియోన్ తెలుగులోనూ నటించింది. తెలుగులో ఈ ముద్దుగుమ్మ రాజశేఖర్ హీరోగా నటించిన గరుడ వేగ సినిమాలో స్పెషల్ సాంగ్ , ఆ తర్వాత తెలుగులో కరెంట్ తీగ, మంచు విష్ణు నటించిన జిన్నా సినిమాల్లో చేసింది.