కరోనా వైరస్ మానవ నిర్మితమే, వుహాన్ ల్యాబ్ నుంచే లీకయ్యింది.. అమెరికా శాస్త్రవేత్త సంచలన కథనం

Covid-19 was Man Made Virus, Leaked From Chinese Lab Claims US Scientist Who Worked at Wuhan Lab Covid-19 was Man Made Virus, Leaked From Chinese Lab, Claims US Scientist,Wuhan Lab,Mango News,Mango News Telugu,Covid In India,Covid,Covid-19 India,Covid-19 Latest News And Updates,Covid-19 Updates,Covid India,India Covid,Covid News And Live Updates,Carona News,Carona Updates,Carona Updates,Cowaxin,Covid Vaccine,Covid Vaccine Updates And News,Covid Live,Carona Live Updates,Wuhan Lab Latest News and Updates

ప్రపంచాన్ని వణికించిన కరోనా వైరస్ అనుకోకుండా ఉద్భవించినది కాదని, ఆ మహమ్మారి మానవ నిర్మితమని బాంబ్ పేల్చారు అమెరికా శాత్రవేత్త ‘ఆండ్రూ హాఫ్’. ఇక అందరూ అనుమానిస్తున్నట్లు దీని వెనుక చైనా ఉందని కూడా ఆయన తెలిపారు. గతంలో ఈ శాత్రవేత్త చైనా లోని వుహాన్ ల్యాబ్‌లో పనిచేసి ఉండటంతో ఈ వార్త పెను సంచలనమైంది. తాజాగా ఈ శాస్త్రవేత్త రాసిన ‘ది ట్రూత్ అబౌట్ వుహాన్’ అనే పుస్తకం అంతర్జాతీయంగా చర్చనీయాంశం అవుతోంది. చైనీస్ ల్యాబ్ నుండి కోవిడ్-19 మానవ నిర్మిత వైరస్ లీక్ అయిందని ఆయన స్ఫష్టం చేశారు. కాగా ఈ ల్యాబ్ వైరస్ యొక్క మూలాల గురించి ప్రపంచవ్యాప్తంగా అనుమానాలు ఉన్నాయి. చైనాలోని వుహాన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ నుంచి ఈ వైరస్ లీక్ అయిందని, దీనిని 9/11 తర్వాత అతిపెద్ద యుఎస్ ఇంటెలిజెన్స్ వైఫల్యం అని బ్రిటన్‌కు చెందిన ‘ది సన్’ నివేదించినట్లు సదరు శాస్త్రవేత్త చెప్పారు.

దీని ప్రకారం.. ‘సరైన జీవ భద్రత, బయోసెక్యూరిటీ మరియు రిస్క్ మేనేజ్‌మెంట్‌ను నిర్ధారించడానికి విదేశీ ప్రయోగశాలల్లో తగిన నియంత్రణ చర్యలు లేవు. చివరికి వుహాన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ ల్యాబ్ నుంచే ఇది లీక్ అయింది’ అని ఆండ్రూ హాఫ్ తన పుస్తకంలో పేర్కొన్నాడు. చైనా యొక్క ‘గెయిన్-ఆఫ్-ఫంక్షన్ ప్రయోగాలు’ వుహాన్ ల్యాబ్‌లో లీక్‌కు దారితీసిందని వెల్లడించాడు. అయితే వుహాన్ ల్యాబ్ నుండి వైరస్ లీక్ అయిందనే వార్తలను చైనా ప్రభుత్వం మరియు ల్యాబ్ సిబ్బంది పదే పదే ఖండించారు. ఇక ఆండ్రూ హఫ్ ఎకోహెల్త్ అలయన్స్ మాజీ వైస్ ప్రెసిడెంట్. న్యూయార్క్‌కు చెందిన ఈ లాభాపేక్ష రహిత సంస్థ అంటు వ్యాధులను అధ్యయనం చేస్తుంది. ముఖ్యంగా సంస్థ ఒక దశాబ్దానికి పైగా గబ్బిలాలలో కరోనా వైరస్ లపై అధ్యయనం చేస్తోంది. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ నుండి దీనికి నిధులు అందుతుంటాయి. ఈ బృందానికి వుహాన్ ల్యాబ్‌తో సన్నిహిత సంబంధాలు ఉండటం విశేషం.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

nine + nine =