భారత్‌లో అదుపులోకి వస్తున్న కరోనా మహమ్మారి వ్యాప్తి.. 500కు పడిపోయిన రోజువారీ కేసులు

India Corona Updates Union Health Ministry Reports 550 New Infections and 6591 Active Cases in Last 24 Hrs,India Corona Updates,Union Health Ministry Reports 550 New Infections,India 6591 Active Cases in Last 24 Hrs,Mango News,Mango News Telugu,Corona,Corona Active Cases in Last 24 Hrs,Corona Cases,Corona cases 2023,Corona cases in India today,Corona cases in india today live updates,Corona new updates in India,Corona updates in India 2023,Coronavirus Latest News,Coronavirus outbreak,Union Health Ministry Latest News,Union Health Ministry Latest Updates

భారత్‌లో కరోనా మహమ్మారి వ్యాప్తి క్రమంగా అదుపులోకి వస్తోంది. ఈ నెల ప్రారంభంలో ప్రతిరోజూ వెయ్యికి పైనే నమోదయిన కొత్త కేసులు.. ఆ తర్వాత తగ్గుముఖం పట్టాయి. గత వారం నుంచి రోజుకి వెయ్యి లోపే కేసులు నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ దేశంలో కరోనాకు సంబంధించిన కేసుల వివరాలు వెల్లడించింది. దీని ప్రకారం.. గడిచిన 24 గంటల్లో (మంగళవారం ఉదయం నుంచి బుధవారం ఉదయం వరకు) మొత్తం 1,09,695 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా.. కొత్తగా 550 మందిలో కోవిడ్-19 పాజిటివ్‌ వెలుగు చూసింది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 4,49,87,891కి చేరింది. ఇక దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య 6 వేలకు పడిపోయింది. కాగా మరోవైపు ఒక్క రోజులో కరోనా మహమ్మారి బారిన పడి 6గురు ప్రాణాలు కోల్పోయారు. తద్వారా దేశవ్యాప్తంగా మొత్తం కరోనా మరణాల సంఖ్య 5,31,849కి చేరింది.

దేశంలో కరోనా కేసులు వివరాలు (2023, మే 24, ఉదయం 8 గంటల వరకు):

  • గత 24 గంటల్లో నిర్వహించిన కరోనా పరీక్షలు : 1,09,695
  • కొత్తగా నమోదైన కేసులు [మే 23–మే 24 (8AM-8AM)] : 550
  • మొత్తం పాజిటివ్ కేసులు సంఖ్య : 4,49,87,891
  • కొత్తగా కోలుకున్నవారి సంఖ్య : 1,059
  • రికవరీ అయిన వారి మొత్తం సంఖ్య : 4,44,49,451
  • కరోనా రికవరీ రేటు : 98.81 శాతం
  • యాక్టివ్ కేసులు : 6,591
  • కొత్తగా నమోదైన మరణాలు : 6
  • మొత్తం మరణాల సంఖ్య : 5,31,849
  • మొత్తం కరోనా వ్యాక్సిన్‌ డోసులు: 220.66 (2,20,66,01,276) కోట్లు పంపిణీ.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

3 × one =