తుళ్లూరులో తీవ్ర ఉద్రిక్తత.. ఆర్-5 జోన్‌కు వ్యతిరేకంగా రైతుల నిరసన, 144 సెక్షన్ విధింపు

AP High Tension Prevails at Tulluru Police Imposed Section 144 During Amaravati Farmers Protest Against R5 Zone,AP High Tension Prevails at Tulluru,Tulluru Police Imposed Section 144,Amaravati Farmers Protest Against R5 Zone,Mango News,Mango News Telugu,Amaravati Farmers Protest,Section 144 During Amaravati Farmers Protest,Tension mounts at Tulluru,Tulluru 144 Section Latest News,Tulluru 144 Section Latest Updates,Amaravati Farmers Protest News Today,Amaravati Farmers Protest Latest News,Amaravati Farmers Protest Latest Updates,Amaravati Farmers Latest News,Amaravati News Updates

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి ప్రాంతంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. గుంటూరు జిల్లా తుళ్లూరులో ఆర్‌-5 జోన్‌ ఏర్పాటును నిరసిస్తూ బుధవారం నుంచి గురువారం వరకూ 48 గంటల దీక్షకు జై భీం భారతి పార్టీ అధ్యక్షుడు జడ శ్రావణ్ కుమార్ పిలుపు ఇచ్చారు. శ్రావణ్ కుమార్ దీక్షకు మద్దతుగా రాజధాని ప్రాంత రైతులు పెద్ద ఎత్తున తరలి వచ్చారు. అయితే దీక్షకు వచ్చిన శ్రావణ్ కుమార్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అలాగే జై భీం పార్టీకి చెందిన పలువురు నాయకులు, కార్యకర్తలను అంబేడ్కర్ విగ్రహం వద్ద అరెస్టు చేశారు. అంతేకాకుండా ఈరోజు శిబిరం నిర్వహించ వద్దంటూ రైతులకు పోలీసులు ఆదేశించారు. తుళ్లూరు మెయిన్ బజారులో ఎవ్వరూ ఉండొద్దని, త్వరగా వెళ్లిపోవాలని ఆదేశించారు. రోడ్‌పైన, ఇంటి ముందు కూర్చున్న గ్రామస్తులను లోపలకు వెళ్లాలని పోలీసులు కోరుతున్నారు. తుళ్లూరులో 144 సెక్షన్ విధిస్తున్నట్లు ప్రకటించారు. దీంతో పోలీసుల వైఖరిపై రైతులు మండిపడుతున్నారు. ప్రైవేట్ స్థలంలో శాంతియుతంగా దీక్ష చేస్తుంటే ఖాళీ చేయాలని పోలీసులు ఆదేశించడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

5 × four =