డిజిటల్‌ అగ్రికల్చర్‌ మిషన్‌… రైతుల కోసం మరో కేంద్ర పథకం..!

Another Central Scheme For Farmers, Another Central Scheme, Central Scheme, Central Government Schemes, Agriculture Schemes, Schemes for Farmers, Welfare Schemes For Farmers, Agriculture Mission, Central Scheme For Farmers, Digital Agriculture Mission, Latest Central Scheme, National News, India, Congress, BJP, PM Modi, Live Updates, Breaking News, Live News, Mango News, Mango News Telugu

రైతుల కోసం మోదీ ప్రభుత్వం తాజాగా కొన్ని కీలక ప్రకటనలు చేసింది. రైతుల గురించి కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ సమాచారమిచ్చారు. ప్రభుత్వం డిజిటల్‌ అగ్రికల్చర్‌ మిషన్‌ను ప్రారంభిస్తోందని తెలిపారు. దీనికోసం రూ.2,817 కోట్లు వెచ్చించనున్నట్లు అశ్వినీ వైష్ణవ్ తెలిపారు. ఇది కాకుండా రైతుల ఆదాయాన్ని పెంచి వారి జీవితాలను సులభతరం చేయడానికి మరో 6 పథకాలకు ఆమోదాన్ని తెలిపారు. అశ్విని వైష్ణవ్ చెబుతున్న దాని ప్రకారం.. డిజిటల్ అగ్రికల్చర్ మిషన్ డిజిటల్ పబ్లిక్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ తరహాలో నిర్మించబడుతోందని అన్నారు. దాని పైలట్ ప్రాజెక్టులలో కొన్ని విజయవంతమయ్యాక, ఇప్పుడు దేశవ్యాప్తంగా అమలు చేయబడుతోందని చెప్పారు.

నిజానికి డిజిటల్ అగ్రికల్చర్ మిషన్ అనేది భారత ప్రభుత్వం యొక్క ప్రతిష్టాత్మక పథకం. వ్యవసాయ రంగంలో డిజిటల్ టెక్నాలజీలను ఉపయోగించడం ద్వారా రైతుల ఆదాయాన్ని పెంచడంతో పాటు వ్యవసాయ ఉత్పాదకతను మెరుగుపరచడమే ఈ మిషన్ లక్ష్యంగా ఉంది. ఈ మిషన్ ద్వారా, రైతులు వాతావరణ అంచనా, విత్తనాల నాణ్యత, పురుగులమందు వాడకం, మార్కెట్ సమాచారం వంటి వివిధ వ్యవసాయ సంబంధిత సేవలను ఈ ఆన్‌లైన్‌లోనే పొందుపర్చుతారు.

అసలు డిజిటల్ అగ్రికల్చర్ మిషన్ లక్ష్యం ఏమిటంటే..డిజిటల్ సాధనాలు, ప్లాట్‌ఫారమ్‌ల ద్వారా వ్యవసాయ సంబంధిత సమాచారం, సర్వీసులను అందించడం ద్వారా రైతులకు సాధికారత కల్పించడమే. అలాగే వీటితో పాటు అధునాతన వ్యవసాయ పద్ధతులు, నీటి వనరుల మెరుగైన నిర్వహణ, భూసారాన్ని పెంచడం వల్ల వ్యవసాయ ఉత్పాదకతను మెరుగుపరచడం కూడా దీని లక్ష్యమే. వ్యవసాయ ఖర్చులను తగ్గించడంతో పాటు, ఆవిష్కరణలను ప్రోత్సహించడం కూడా మిషన్ లక్ష్యాలలో చేర్చబడింది.

సోమవారం జరిగిన క్యాబినెట్ సమావేశంలో అశ్విని వైష్ణవ్ మాట్లాడుతూ.. రైతుల జీవితాలను మెరుగుపరచడంతో పాటు..వారి ఆదాయాన్ని పెంచడానికి 7 ప్రధాన నిర్ణయాలు తీసుకున్నామని చెప్పారు. మొదటిది డిజిటల్ అగ్రికల్చర్ మిషన్. వ్యవసాయానికి డిజిటల్ పబ్లిక్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ తరహాలోనే దీనిని అభివృద్ధి చేస్తున్నారని అన్నారు. కొన్ని మంచి పైలట్ ప్రాజెక్టులు ప్రారంభమయ్యాయని..దానిలో మేము విజయం సాధించామన్నారు. అదే ప్రాతిపదికన మొత్తం రూ.2,817 కోట్ల పెట్టుబడితో డిజిటల్ అగ్రికల్చర్ మిషన్‌ను ఏర్పాటు చేస్తారని అశ్వినీ వైష్ణవ్ వివరించారు.