బీహార్ లో ఎన్డీఏ కూటమికి ఘన విజయం, 125 సీట్లు కైవసం

Bihar Assembly Elections 2020 Results: NDA Gets 125 Seats and Set to Form Govt Again

బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో హోరాహోరీ పోటీ నెలకొనడంతో ఫలితాలపై దేశవ్యాప్తంగా ఆసక్తి నెలకున్న సంగతి తెలిసిందే. చివరి వరకు ఉత్కంఠ నెలకున్న ఈ ఫలితాల్లో ఎన్డీఏ కూటమి (బీజేపీ+జనతాదళ్ యునైటెడ్+వీఐపీ+హెఛ్ఏఎంఎస్) 125 సీట్లు దక్కించుకుని విజయభేరి మోగించింది. బీహార్ లో సీఎం పీఠం దక్కించుకునేందుకు 122 అసెంబ్లీ స్థానాలు కావాల్సి ఉండగా, ఎన్డీఏ 125 స్థానాల్లో గెలుపొందడంతో మరోసారి నితీష్ కుమార్ సీఎం పదవి చేపట్టనున్నారు. మరోవైపు ఆర్జేడీ అధినేత తేజస్వి ప్రసాద్ యాదవ్ నేతృత్వంలోని మహాగట్‌బంధన్ (కాంగ్రెస్, ఆర్జేడీ, వామపక్షాలు) 110 స్థానాల్లో గెలుపొంది గట్టి పోటీ ఇచ్చింది. అయితే చిరాగ్ పాశ్వాన్ నాయకత్వంలోని ఎల్జేపీ పార్టీ ఎలాంటి ప్రభావం చూపలేకపోతుంది. ఈ ఎన్నికల్లో 75 సీట్లతో ఆర్జేడీ అతిపెద్ద పార్టీగా అవతరించగా, ఎన్డీఏ కూటమిలో 74 సీట్లతో అతిపెద్ద పార్టీగా బీజేపీ నిలిచింది.

బీహార్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు- 243: (గెలుపు):

ఎన్డీఏ కూటమి:

  • బీజేపీ: 74
  • జేడీయూ: 43
  • వీఐపీ: 4
  • హెఛ్ఏఎంఎస్ : 4

మహాగట్‌బంధన్:

  • ఆర్జేడీ: 75
  • కాంగ్రెస్: 19

వామపక్షాలు: 16
———————-

  • ఏఐఎంఐఎం- 5
  • ఎల్జేపీ: 1
  • బహుజన సమాజ్ పార్టీ: 1
  • ఇండిపెండెంట్: 1

మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ