కాంగ్రెస్ చేపట్టిన ‘భారత్ జోడో యాత్ర’ ఏడో రోజుకు చేరుకుంది. రాహుల్ గాంధీ నేతృత్వంలోని పార్టీ నేతలు మంగళవారం కనియాపురం నుంచి పాదయాత్రను ప్రారంభించారు. ఈ క్రమంలో రాహుల్ పాదయాత్ర 100 కి.మీ పూర్తి చేసుకుంది. కేరళలో మొత్తం 17 రోజుల పాటు జరుగనున్న ఈ యాత్ర మంగళవారం మూడో రోజు కొనసాగుతోంది. దీనిపై రాహుల్ గాంధీ ట్విట్టర్‌లో ఒక సందేశం ఉంచారు. ‘భారతదేశంలోని ప్రజల యొక్క కలలను నెరవేర్చడానికి మేము దేశాన్ని ఏకతాటిపై నిలిపేందుకు అన్ని రాష్ట్రాలనూ కలుపుకుంటూ పయనిస్తున్నాం. ఈ ప్రయత్నంలో భాగంగా తొలి 100 కి.మీ దూరం పూర్తయింది. మరెంతో దూరం ఎదురు చూస్తోంది’ అని రాహుల్ ట్విట్టర్‌లో పేర్కొన్నారు. కాగా కేరళలో భారీ వర్షంలోనూ ప్రజల నుంచి రాహుల్ యాత్రకు మంచి మద్దతు లభిస్తోంది. ఈ క్రమంలో అన్ని వర్గాల ప్రజలతో ఆయన మమేకమవుతున్నారు. కన్యాకుమారి నుండి కాశ్మీర్ వరకు 3,500 కిలోమీటర్లు, 150 రోజుల పాటు కొనసాగనున్న ఈ పాదయాత్ర మొత్తం 12 రాష్ట్రాలగుండా పయనించనుంది. ఇక ఈ యాత్ర సెప్టెంబర్ 30న కేరళ నుండి కర్నాటకకు చేరుకుంటుంది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY