మరికొన్ని నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో గుజరాత్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో ఉమ్మడి పౌర స్మృతి (యూనిఫామ్ సివిల్ కోడ్ – యూసీసీ) అమలు కోసం ఉన్నతస్థాయి కమిటీ ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించింది. గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ ఆధ్వర్యంలో శనివారం జరిగిన మంత్రివర్గ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. ఈ కమిటీకి రిటైర్డ్ హైకోర్టు లేదా సుప్రీంకోర్టు న్యాయమూర్తి సారధ్యం వహిస్తారని, యూనిఫాం సివిల్ కోడ్ అవసరాన్ని పరిశీలించి, ప్రభుత్వానికి నివేదిక అందజేస్తుందని, దీనిపై ప్రభుత్వం చర్చించి నిర్ణయం తీసుకుంటుందని సీఎం పటేల్ తెలిపారు. కాగా ఒకసారి ఈ విధానం అమలులోకి వస్తే వివాహం, వారసత్వం, ఆస్తి హక్కులకు సంబంధించి ఆ రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలకు ఒకే చట్టం అమలవుతుంది.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హెచ్‌ఎం అమిత్ షా ఆకాంక్షలకు అనుగుణంగా సీఎం భూపేంద్ర పటేల్ ఈరోజు జరిగిన కేబినెట్ సమావేశంలో చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్నారని, రాష్ట్రంలో యూనిఫాం సివిల్ కోడ్ అమలు కోసం కమిటీని ఏర్పాటు చేయడంపై నిర్ణయం తీసుకున్నామని సమావేశం అనంతరం గుజరాత్ హోం మంత్రి హర్ష్ సంఘవి మీడియాకు తెలిపారు. కాగా భారతీయ జనతా పార్టీ 2019 లోక్‌సభ ఎన్నికల మేనిఫెస్టోలో తాము అధికారంలోకి వస్తే యూనిఫామ్ సివిల్ కోడ్ ని అమలు చేస్తామని హామీ ఇచ్చింది. అయితే దీనిని ప్రతిపక్షాలు ‘యాంటీ-మైనారిటీ’ అని పేర్కొంటున్నాయి. ఇక గుజరాత్ ప్రభుత్వ తాజా నిర్ణయంతో.. హిమాచల్ ప్రదేశ్ మరియు ఉత్తరాఖండ్ తర్వాత ఈ చర్యను ప్రకటించిన మూడవ భారతీయ జనతా పార్టీ పాలిత రాష్ట్రంగా గుజరాత్ నిలిచింది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY