ఇండియా vs సౌత్ ఆఫ్రికా మూడో టీ-20: కీలక మ్యాచ్‌లో భారత్‌ జయభేరి, సిరీస్ ఆశలు సజీవం

IND vs SA 3rd T-20 Highlights Team India Won The Match By 48 Runs To Stay Alive in Series, IND vs SA 3rd T-20 Highlights, Team India Won The Match By 48 Runs To Stay Alive in Series, Team India Won The Match, Team India Won By 48 Runs, India vs South Africa 3rd T20I Match at Dr YSR ACA-VDCA Cricket Stadium in Vizag, Dr YSR ACA-VDCA Cricket Stadium in Vizag, India vs South Africa 3rd T20I, Ind vs SA 3rd T20I, Vizag YSR ACA-VDCA Cricket Stadium, YSR ACA-VDCA Cricket Stadium, India vs South Africa, 3rd T20I, IND vs SA 3rd T20I Pitch Report, IND vs SA 3rd T20I Weather Forecast, YS Rajasekhara Reddy Cricket Stadium in Vizag, YS Rajasekhara Reddy ACA-VDCA Cricket Stadium in Vizag, Ind vs SA 3rd T20I News, Ind vs SA 3rd T20I Latest News, Ind vs SA 3rd T20I Latest Updates, Ind vs SA 3rd T20I Live Updates, Mango News, Mango News Telugu,

సిరీస్‌లో నిలవాలంటే తప్పక గెలవాల్సిన పరిస్థితుల్లో టీమిండియా నిలబడింది. జట్టు సమిష్టి ప్రదర్శనతో మూడో వన్డేలో దక్షిణాఫ్రికాపై ఘన విజయం సాధించింది. తొలి రెండు మ్యాచ్‌లలో భారీ స్కోరు సాధించినా ఓటమి చెందిన నేపథ్యంలో.. తీవ్ర ఒత్తిడిలో బరిలోకి దిగిన భారత్ కీలక మ్యాచ్‌లో సత్తాచాటి సిరీస్‌లో ఆశలు ఇంకా సజీవంగా ఉంచుకుంది. మొదట బ్యాటింగ్‌లో రుతురాజ్‌ గైక్వాడ్‌, ఇషాన్‌ కిషన్‌ అర్ధసెంచరీలతో భారీ స్కోరు సాధించిన భారత్ అనంతరం కట్టుదిట్టమైన బౌలింగ్‌తో దక్షిణాఫ్రికాను నిలువరించింది. ఈ క్రమంలో తొలుత బ్యాటింగ్‌కు దిగిన భారత్‌ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 179 పరుగులు చేసింది.

రుతురాజ్‌ గైక్వాడ్‌ (35 బంతుల్లో 57; 7 ఫోర్లు, 2 సిక్స్‌లు), ఇషాన్‌ కిషన్‌ (35 బంతుల్లో 54; 5 ఫోర్లు, 2 సిక్స్‌లు) అర్ధసెంచరీలతో జట్టు భారీ స్కోరు చేయటంలో కీలక పాత్ర పోషించారు. తర్వాత వచ్చిన అయ్యర్‌ (14), కెప్టెన్‌ పంత్‌ (6) నిరాశపర్చగా, హార్దిక్‌ పాండ్యా (21 బంతుల్లో 31 నాటౌట్‌, 4 ఫోర్లు) చెలరేగి ఆడాడు. దీంతో భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 179/5 స్కోరు చేసింది. దక్షిణాఫ్రికా బౌలర్లలో. ప్రిటోరియస్‌ రెండు వికెట్లు దక్కగా, శంసీ, మహారాజ్‌, రబాడ ఒక్కో వికెట్‌ తీశారు. ఆ తర్వాత లక్ష్యఛేదనకు దిగిన దక్షిణాఫ్రికా 19.1 ఓవర్లలో 131 పరుగులకు ఆలౌటైంది. ఆ జట్టులో క్లాసెన్‌ (29; 3 ఫోర్లు, 1 సిక్స్‌) ఒక్కడే టాప్‌ స్కోరర్‌. హర్షల్‌ పటేల్‌ (4/25) అద్భుత స్పెల్ వేయగా, సీనియర్ స్పిన్నర్  చాహల్‌ మూడు కీలక వికెట్లు తీసిన చాహల్‌కు ‘మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ దక్కింది. ఇక సిరీస్‌లో కీలకమైన నాలుగో మ్యాచ్ ఈనెల 17న రాజ్‌కోట్‌లో జరుగుతుంది.

స్కోరు వివరాలు

భారత్‌ ఇన్నింగ్స్‌: రుతురాజ్‌ (సి అండ్‌ బి) కేశవ్‌ 57; ఇషాన్‌ (సి) హెండ్రిక్స్‌ (బి) ప్రిటోరియస్‌ 54; శ్రేయస్‌ (సి) నోర్జే (బి) షమ్సీ 14; పంత్‌ (సి) బవుమా (బి) ప్రిటోరియస్‌ 6; హార్దిక్‌ (నాటౌట్‌) 31; దినేశ్‌ కార్తీక్‌ (సి) పార్నెల్‌ (బి) రబడ 6; అక్షర్‌ (నాటౌట్‌) 5; ఎక్స్‌ట్రాలు 6; మొత్తం (20 ఓవర్లలో 5 వికెట్లకు) 179.

బౌలింగ్‌: రబడ 4–0–31–1, పార్నెల్‌ 4–0–32–0, నోర్జే 2–0–23–0, ప్రిటోరియస్‌ 4–0–29–2, షమ్సీ 4–0–36–1, కేశవ్‌ 2–0–24–1.

దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్‌: బవుమా (సి) అవేశ్‌ (బి) అక్షర్‌ 8; హెండ్రిక్స్‌ (సి) చహల్‌ (బి) హర్షల్‌ 23; ప్రిటోరియస్‌ (సి) పంత్‌ (బి) చహల్‌ 20; డసెన్‌ (సి) పంత్‌ (బి) చహల్‌ 1; క్లాసెన్‌ (సి) అక్షర్‌ (బి) చహల్‌ 29; మిల్లర్‌ (సి) రుతురాజ్‌ (బి) హర్షల్‌ 3; పార్నెల్‌ (నాటౌట్‌) 22; రబడ (సి) చహల్‌ (బి) హర్షల్‌ 9; కేశవ్‌ (సి) కార్తీక్‌ (బి) భువనేశ్వర్‌ 11; నోర్జే రనౌట్‌ 0; షమ్సీ (సి) అవేశ్‌ ఖాన్‌ (బి) హర్షల్‌  పటేల్‌ 0; ఎక్స్‌ట్రాలు 5; మొత్తం (19.1 ఓవర్లలో ఆలౌట్‌) 131.

బౌలింగ్‌: భువనేశ్వర్‌ 4–0–21–1, అవేశ్‌ ఖాన్‌ 4–0–35–0, అక్షర్‌ పటేల్‌ 4–0–28–1, చాహల్‌ 4–0–20–3, హర్షల్‌ పటేల్‌ 3.1–0–25–4.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

three × 4 =