ఐపీఎల్: ఫైనల్ మ్యాచ్ టైం మార్పు, రాత్రి 8 గంటలకు ప్రారంభమవుతుందన్న బీసీసీఐ

IPL 2022 Final Match in Ahmedabad Narendra Modi Stadium Set To Start at 8 PM After Closing Ceremony, 2022 IPL Final Match in Ahmedabad Narendra Modi Stadium Set To Start at 8 PM After Closing Ceremony, IPL Final Match in Ahmedabad Narendra Modi Stadium Set To Start at 8 PM After Closing Ceremony, Ahmedabad Narendra Modi Stadium, Closing Ceremony, IPL 2022 Final Match, 2022 IPL Final Match, IPL 2022 Season Finale to Begin at 8 PM at Ahmedabad Narendra Modi Stadium, IPL 2022 Season Finale to begin at 8pm instead of 7.30pm, IPL-2022, TATA IPL 2022, 2022 TATA IPL, Tata IPL, Indian Premier League, Indian Premier League News, Indian Premier League Latest News, Indian Premier League Latest Updates, Indian Premier League Live Updates, Cricket, Cricket Latest News, Cricket Live Updates, Mango News, Mango News Telugu,

భారత క్రికెట్ అభిమానులను విశేషంగా అలరిస్తున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) మరికొన్ని రోజుల్లో ముగియనుంది. అయితే ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ కు సంబంధించి ఒక కీలక అప్డేట్ వచ్చింది. దీనిప్రకారం, ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ మొతేరాలోని నరేంద్ర మోదీ స్టేడియంలో మే 29న రాత్రి 8 గంటలకు ప్రారంభం కానుంది. మ్యాచ్ ఆరంభానికి ముందు ముగింపు వేడుకలు నిర్వహించేందుకు నిర్ణయం తీసుకున్నారు. ముగింపు వేడుకలను దృష్టిలో ఉంచుకుని సాధారణ సమయం కంటే 30 నిమిషాలు ఆలస్యంగా మ్యాచ్‌ను ప్రారంభించేందుకు బీసీసీఐ అంగీకరించింది.

కోవిడ్ కారణంగా, 2019 తర్వాత ఐపీఎల్ ముగింపు వేడుకను నిర్వహించడం ఇదే మొదటిసారి కావడంతో.. భారీగా నిర్వహించటానికి బీసీసీఐ ఏర్పాట్లు చేస్తోంది. బాలీవుడ్‌కు చెందిన పలువురు ప్రముఖులను ఈ ముగింపు వేడుకకు ఆహ్వనించారు. సాయంత్రం 6:30 గంటలకు ప్రారంభమై 50 నిమిషాల పాటు వేడుకలు కొనసాగనున్నాయి. అనంతరం రాత్రి 7:30 గంటలకు టాస్‌ వేయనుండగా, 8 గంటలకు మ్యాచ్‌ ప్రారంభం కానుంది. ఈ వేడుకలకు రణవీర్ సింగ్ మరియు ఏఆర్ రెహమాన్ సహా పలువురు బాలీవుడ్ ప్రముఖులు పాల్గొననున్నారు. కాగా ప్లేఆఫ్‌లు మే 24 నుండి ప్రారంభమవుతాయి. తొలి క్వాలిఫయర్‌తో పాటు ఎలిమినేటర్‌కు కోల్‌కతా ఆతిథ్యం ఇవ్వనుంది. అలాగే అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో క్వాలిఫయర్ 2తో పాటు ఫైనల్ మ్యాచ్ కూడా జరగనుంది. ఐపీఎల్‌ ఫైనల్ మ్యాచ్ రాత్రి 8 గంటలకు ప్రారంభమవుతుందని ఇప్పటికే బీసీసీఐ అన్ని ఫ్రాంచైజీలకు తెలియజేసినట్లు సమాచారం.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here