గత ఆర్థిక సంవత్సరం (2024-25)కు సంబంధించిన ఆదాయపు పన్ను రిటర్నులు (ITR) దాఖలు చేయని లేదా పొరపాట్లు చేసిన పన్ను చెల్లింపుదారులకు గడువును పొడిగిస్తూ ఆదాయపు పన్ను శాఖ అవకాశం కల్పించింది. డిసెంబర్ 31లోపు సవరించిన (Revised) లేదా ఆలస్య (Belated) పన్ను రిటర్నులు దాఖలు చేయవచ్చని తెలిపింది. వాస్తవానికి ఈ మదింపు సంవత్సరానికి ఐటీఆర్ దాఖలు చేయడానికి గడువు సెప్టెంబర్ 16తో ముగిసింది.
ఆలస్య (Belated) రిటర్నులు
-
గడువు: డిసెంబర్ 31, 2025 వరకు.
-
ఎవరికి వర్తిస్తుంది: గడువులోగా ఐటీఆర్ దాఖలు చేయని వారికి.
-
అపరాధ రుసుము:
-
పన్ను వర్తించే ఆదాయం రూ. 5 లక్షల లోపు ఉంటే: రూ. 1,000
-
పన్ను వర్తించే ఆదాయం రూ. 5 లక్షల పైన ఉంటే: రూ. 5,000
-
-
ముఖ్య గమనిక: డిసెంబర్ 31 తర్వాత ఆలస్య రిటర్నులు దాఖలు చేసే అవకాశం కోల్పోతారు. ఒకవేళ రిఫండ్ రావాల్సి ఉంటే, ఆ అవకాశాన్ని కూడా కోల్పోతారు. బిలేటెడ్ రిటర్నులను కొత్త పన్ను విధానంలో మాత్రమే సమర్పించేందుకు వీలవుతుంది.
సవరించిన (Revised) రిటర్నులు
-
ఎవరికి వర్తిస్తుంది: ఇప్పటికే ఐటీఆర్ దాఖలు చేసినా, అందులో ఏదైనా పొరపాటు చేశారని (ఉదాహరణకు, ముఖ్యమైన సమాచారాన్ని మర్చిపోవడం, తప్పు టీడీఎస్ నమోదు చేయడం, అధిక రిఫండ్‌ను కోరడం, మినహాయింపు మర్చిపోవడం లేదా విదేశీ ఆస్తులను చూపకపోవడం) ఇప్పుడు గ్రహించిన వారు.
-
ప్రయోజనం: దాఖలు చేసిన తప్పును సరిచేసుకునేందుకు సెక్షన్ 139(5) కింద ఈ రివైజ్డ్ రిటర్నులను దాఖలు చేయవచ్చు.

































