రాష్ట్రంలో పెద్ద సంఖ్యలో కరోనా పాజిటివ్ కేసులు, మరణాలు నమోదవుతున్న నేపథ్యంలో కర్ణాటక ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం అమల్లో ఉన్న కరోనా కర్ఫ్యూ అంతగా ఫలితాన్ని ఇవ్వని క్రమంలో మే 10వ తేదీ ఉదయం 6 గంటల నుండి మే 24వ తేదీ ఉదయం 6 గంటల వరకు పూర్తిస్థాయి లాక్‌డౌన్ విధిస్తున్నట్లు కర్ణాటక ముఖ్యమంత్రి యడియూరప్ప ప్రకటించారు. లాక్‌డౌన్ అమలు సమయంలో నిత్యావసరాల దుకాణాలు కేవలం ఉదయం 6 నుంచి 10 గంటల వరకు తెరిచేందుకు అనుమతి ఉంటుందని చెప్పారు.
ఇక హోటళ్లు, పబ్బులు, బార్లు అన్ని మూసివేయాలని ఆదేశాలు ఇచ్చారు. అలాగే ఉదయం 10 గంటల తర్వాత బయటఎవరు తిరగకుండా పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పారు. ఈ లాక్‌డౌన్ తాత్కాలిక నిర్ణయమని, రాష్ట్రం నుండి వలస కూలీలు ఎవరు సొంత గ్రామాలకు వెళ్లవద్దని సూచించారు. మరోవైపు కర్ణాటక రాష్ట్రంలో ఇప్పటివరకు 18,38,885 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇందులో 12,84,420 మంది కరోనా నుంచి కోలుకోగా, 17,804 మంది మరణించారు. ప్రస్తుతం 5,36,641 యాక్టీవ్ కేసులు ఉన్నాయి.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ





































