వలస కార్మికులు, గ్రామీణ పౌరులకు జీవనోపాధి అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా “గరీబ్ కల్యాణ్ రోజ్‌గార్ అభియాన్” కార్యక్రమాన్నికేంద్రప్రభుత్వం రూపొందించింది. ఈ రోజు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా బీహార్ లోని ఖగారియా జిల్లాకు చెందిన తెలిహార్ గ్రామంలో ఈ కార్యక్రమాన్ని ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. గరీబ్ కల్యాణ్ రోజ్‌గార్ అభియాన్ ద్వారా రూ.50 వేల కోట్ల వ్యయంతో వలస కార్మికులకు ఉపాధి కల్పించడంతో పాటు గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక వసతుల అభివృద్ధి లక్ష్యంగా 25 విభిన్న పనులు చేపట్టనున్నారు.
బీహార్, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, జార్ఖండ్, ఒడిశా రాష్ట్రాల్లో వలస కార్మికులు ఎక్కువుగా ఉన్న 116 జిల్లాలను ఎంపిక చేశారు. 116 జిల్లాల్లోని వలస కూలీలకు కనీసం 125 రోజులు పని కల్పించేలా ఈ కార్యక్రమాన్ని రూపొందించారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా లాక్‌డౌన్ నేపథ్యంలో దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి తిరిగి బిహార్‌కు వచ్చిన వలస కార్మికులతో పీఎం మోదీ మాట్లాడారు. వారి సమస్యలు అడిగి తెలుసుకొని, గరీబ్ కల్యాణ్ రోజ్‌గార్ అభియాన్ ద్వారా వారి కష్టాలు తీరిపోనున్నాయని వారికీ భరోసా కల్పించారు.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu