ప్రధాని మోదీకి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి సహా పలువురు ప్రముఖులు

President Vice President and Several Ministerial Colleagues Extend Wishes PM Modi on his Birthday, President Murmu, Ministerial Colleagues Extend Birthday Wishes For PM, Prime Minister Narendra Modi Turns 72, PM Modi 72nd Birthday, Vice-President Jagdeep Dhankhar Greets Modi, Narendra Modi Birthday, Mango News, Mango News Telugu, Happy Birthday Narendra Modi, Wishes Pour in as PM Turns 72, Narendra Modi Birthday Wishes Twitter, Modi Happy Birthday Date, Pm Modi Happy Birthday, PM Modi Latest News And Updates

ప్రధాని నరేంద్ర మోదీ శనివారం 72 వ పుట్టినరోజు జ‌రుపుకుంటున్నారు. ఈ సందర్భంగా సోషల్ మీడియా వేదికగా ఆయనకు పెద్దఎత్తున శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఉప రాష్ట్రపతి జగదీప్ ధన్కర్ సహా పలువురు కేంద్రమంత్రులు.. అమిత్ షా, రాజ్‌నాథ్ సింగ్, జై శంకర్ ప్రధాని మోదీకి శుభాకాంక్షలు చెప్పారు. అలాగే బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ప్రధాని మోదీకి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు.

ఇక ప్రధాని నరేంద్ర మోదీ జన్మదినం సందర్భంగా బీజేపీ పార్టీ నాయకులు మరియు కార్యకర్తలు దేశవ్యాప్తంగా అనేక సామాజిక కార్యక్రమాలు చేపడుతున్నారు. బ్లడ్ డొనేషన్ క్యాంపులు, నదీ జలాలను శుభ్రం చేసే కార్యక్రమాలు, ఖాదీ మరియు స్థానిక ఉత్పత్తులను ఉపయోగించమని ప్రజలను ప్రోత్సహించడం సహా ఎన్నో కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. కాగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ట్విట్టర్‌లో ప్రధాని మోదీకి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. అతని సాటిలేని కృషి, అంకితభావం మరియు సృజనాత్మకతతో దేశ నిర్మాణం ముందుకు సాగుతుందని తెలిపారు.

‘గౌరవనీయులైన భారత ప్రధాన మంత్రి నరేంద్రమోదీకి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. పరివర్తన దార్శనికత మరియు స్ఫూర్తిదాయకమైన నాయకత్వం భారత్‌ను కీర్తి యొక్క కొత్త శిఖరాలకు పెంచాయి. ఆయన మంచి ఆరోగ్యం, సంతోషంతో మరెన్నో సంవత్సరాలు మన దేశానికి సేవలందించాలి’ అని ఉప రాష్ట్రపతి జగదీప్ ధన్కర్ తెలియజేశారు.

కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రధాని మోదీకి శుభాకాంక్షలు తెలుపుతూ ఇలా అన్నారు.. ‘సురక్షితమైన, దృఢమైన మరియు స్వావలంబన కలిగిన నూతన భారతదేశ సృష్టికర్త ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి జన్మదిన శుభాకాంక్షలు. ఆయన జీవితం సేవ మరియు అంకితభావానికి ప్రతిరూపం. స్వాతంత్య్రానంతరం తొలిసారిగా కోట్లాది మంది పేదలకు వారి హక్కులను కల్పించడం ద్వారా మోదీ జీ వారిలో ఆశ, విశ్వాసాన్ని నింపారు. నేడు దేశంలోని ప్రతి వర్గాలూ మోదీకి అండగా నిలుస్తున్నాయి’. అని చెప్పారు.

రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, తన ట్విటర్‌లో.. ప్రధాని మోదీకి పుట్టినరోజు సందర్భంగా హృదయపూర్వక శుభాకాంక్షలు. ఆయన నాయకత్వం మునుపెన్నడూ లేనివిధంగా ప్రగతిని, సుపరిపాలనను పెంపొందించింది. భారతదేశ ప్రతిష్టను, ఆత్మగౌరవాన్ని సరికొత్త శిఖరాగ్రానికి తీసుకెళ్లింది. దేవుడు వారిని ఆరోగ్యంగా ఉంచి దీర్ఘకాలం జీవించాలని కోరుకుంటున్నాను.’ అని తెలిపారు.

ఇక ప్రధాని మోదీకి సొంతపార్టీ నేతలే కాకుండా ప్రతిపక్ష పార్టీల నేతలు పలువురు ముఖ్యమంత్రులు కూడా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు ట్విట్టర్‌లో ఆయన ‘ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి జన్మదిన శుభాకాంక్షలు’ అని వెల్లడించారు.

ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కూడా ప్రధానమంత్రికి శుభాకాంక్షలు తెలిపారు. తన ట్విట్టర్‌లో.. ప్రధాని మోదీకి పుట్టినరోజు అభినందనలు తెలుపుతూ ఆయన దీర్ఘాయుష్షుతో, ఆరోగ్యంగా జీవించాలని ప్రార్థించారు.

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రధానికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ మేరకు ఆయన తన ట్విట్టర్‌లో..’గౌరవనీయులైన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. భగవంతుడు ఆయనకు మంచి ఆరోగ్యంతో పాటు దీర్ఘాయుష్షుని ప్రసాదించుగాక’ అని అన్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

four × one =