తెలంగాణలో కరోనా : కొత్తగా 111 పాజిటివ్ కేసులు, యాక్టీవ్ కేసులు ఎన్నంటే?

Covid-19 in Telangana 111 Positive Cases 128 Recoveries Reported on September 16th, India Records 111 New Covid Cases, 128 Recoveries Reported on September 16th , Mango News, Mango News Telugu, India Logs 111 Covid Positive Cases, 111 New COVID19 Cases In Telangana, COVID19 Cases In India, Carona Live Updates, Covid19 News And Latest Updates, Covid19 Vaccine, COVID New Variant, Booster Dose, India COVID News

తెలంగాణలో కరోనా వైరస్ వ్యాప్తి పూర్తి తగ్గుముఖం దిశగా వెళ్తుంది. ప్రస్తుతం రాష్ట్రంలో 775 యాక్టీవ్ కేసులు ఉన్నాయి. కోత్తగా 111 పాజిటివ్ కేసులు నమోదవడంతో సెప్టెంబర్ 16, శుక్రవారం సాయంత్రం 5:30 గంటల నాటికీ మొత్తం కేసుల సంఖ్య 8,36,522 కి చేరినట్టు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ బులెటిన్ విడుదల చేసింది. అత్యధికంగా హైదరాబాద్ లోనే 47 కేసులు నమోదయ్యాయి. మరోవైపు కరోనా వలన కొత్తగా ఎలాంటి మరణాలు నమోదు కాలేదు, దీంతో మొత్తం కరోనా మరణాల సంఖ్య 4,111 గా ఉంది. కరోనా రికవరీ రేటు 99.42 శాతంకాగా, మరణాల రేటు 0.49 శాతంగా నమోదైంది.

ఇక గత 24 గంటల్లో 128 మంది కరోనా నుంచి కోలుకోగా, రికవరీ అయినవారి సంఖ్య 8,31,636 కు చేరుకుంది. ప్రస్తుతం 775 మంది ఐసోలేషన్ లో లేదా చికిత్స తీసుకుంటున్నట్టు తెలిపారు. శుక్రవారం నాడు 10,346 శాంపిల్స్ కు పరీక్షలు నిర్వహించడంతో మొత్తం పరీక్షల సంఖ్య 3,75,43,842 కు చేరగా, రాష్ట్రంలో ప్రతి పదిలక్షల జనాభాకు 10,08,701 పరీక్షలు నిర్వహించినట్టు పేర్కొన్నారు. అలాగే ఇంకా 300 శాంపిల్స్ యొక్క ఫలితాలు తెలియాల్సి ఉందని తెలిపారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

5 × five =