పంజాబ్‌ ఎన్నికల్లో చెల్లెలి కోసం.. సినీ నటుడు సోనుసూద్‌ ప్రచారం

Malvika worked in Moga on large scale, Mango News, Mango News Telugu, Punjab Polls, Punjab polls 2022, Sonu Sood Campaigning, Sonu Sood Campaigning For His Sister Malvika, Sonu Sood Campaigning For His Sister Malvika Sood in Moga, Sonu Sood Campaigning In Punjab, Sonu Sood hails sister Malvika for social work in Moga, Sonu Sood kicks off campaign for his sister in Moga, Sonu Sood’s sister Malvika Sood joins Congress

వెండితెరపై ఆయనను మించిన విలన్ లేరేమో అనిపిస్తుంది. కానీ, నిజ జీవితంలో మాత్రం ఆయనను మించిన హీరో లేరేమో అనిపిస్తుంది. ఆయనే.. విలక్షణ నటుడు సోనుసూద్. ఒకవైపు, మంచి నటుడిగా గుర్తింపు తెచ్చుకుని సినిమా ఇండస్ట్రీలో కొనసాగుతూనే.. మరోవైపు ప్రజలకు సేవ చేస్తూ గొప్ప స్థాయికి ఎదిగిన నటుడు సోనుసూద్. కరోనా మహమ్మారి విరుచుకుపడుతున్న సమయంలో దేశవ్యాప్తంగా ఎంతోమందికి ఆయన అండగా నిలిచారు. భాషా బేధాలు లేకుండా అడిగినవారికి కాదనకుండా సహాయం చేసి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు సోనుసూద్.

సోనూ సూద్ సోదరి మాళవిక సూద్‌ పంజాబ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. ఇటీవలే, కాంగ్రెస్‌లో చేరిన మాళవిక సూద్‌ పంజాబ్‌లోని మోగా నియోజకవర్గం నుంచి నిలబడుతున్నారు. అక్కడ మాళవిక విజయం కోసం ప్రచారం నిర్వహిస్తున్నారు నటుడు సోనుసూద్. ప్రచారంలో భాగంగా సోనుసూద్ మాట్లాడుతూ.. తన సోదరి మాళవిక సూద్‌ను మోగా ప్రజలు ఆదరిస్తారని నమ్ముతున్నానని చెప్పారు. మొదటి నుంచి తన సోదరి ప్రజల అవసరాలను దగ్గరగా చూసిందన్నారు. నా సోదరి మాళవిక సూద్‌కి ప్రజాసేవ చేయాలన్న తపన ఎక్కువ.. అందుకే ఎన్నికల్లో పోటీ చేస్తోందన్నారు సోనుసూద్.

తన తల్లిదండ్రులు సామాజిక సేవ చేసిన వాళ్లేనని, ఎన్నో పాఠశాలలు, ధర్మశాలు కట్టించిన విషయాన్ని చెప్పారు సోనుసూద్. వాళ్ల స్పూర్తితోనే తన సోదరి మాళవిక సూద్ మోగాలో చాలా మంచి పనులు చేపట్టినట్లుగా వెల్లడించారు. సామాజిక సేవ చేసే వాళ్లకు ప్రజాసేవ చేసే అవకాశం ఇవ్వాలన్నారు సోనుసూద్. సామాజికసేవ చేసే ఫ్యామిలీ నుంచి వచ్చిన మహిళ కాబట్టి మోగా ప్రజలు ఆమెను ఆదరిస్తారని గట్టిగా నమ్ముతున్నాని చెప్పారు. మోగాలో వ్యాక్సినేషన్‌ ప్రక్రియను విజయవంతం చేయడంలో తన సోదరి పాత్ర ఎంతో ఉందన్నారు సోనుసూద్.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYF

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

nineteen − sixteen =