విరాట్ కోహ్లీ గొప్ప నాయకుడు – ఆస్ట్రేలియా లెజెండ్ షేన్ వార్న్

Shane Warne Praises Virat Kohli's Biggest Contribution To Indian Cricket,Shane Warne,Cricketer Shane Warne,Shane Warne Latest News,Shane Warne News,Shane Warne Latest Updates,Shane Warne About Virat Kohli,Virat Kohli,Cricketer Virat Kohli,Virat Kohli Latest News,Virat Kohli News,Virat Kohli Latest Updates,Mango News,Mango News Telugu,Shane Warne Praises Virat Kohli,BCCI,Shane Warne Points Out Biggest Contribution Of Virat Kohli,Shane Warne Point Out Virat Kohli's Biggest Contribution To Indian Cricket,Shane Warne Highlights Virat Kohli,Shane Warne Praises Kohli,Shane Warne Lauds Virat Kohli,Shane Warne Recalls Virat Kohli's Biggest Contribution,Shane Warne Thanks Virat Kohli,Shane Warne Told Virat Kohli's Biggest Contribution,Virat Kohli's Biggest Contribution To Indian Cricket,Indian Cricket,#ShaneWarne,#ViratKohli

టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీపై ఆస్ట్రేలియా స్పిన్ దిగ్గజం షేన్ వార్న్ ప్రశంసలు కురిపించాడు. అతడి వల్లే టెస్టు క్రికెట్ కు ఆదరణ పెరిగిందని పేర్కొన్నాడు. తన నాయకత్వ పటిమతో విరాట్ కోహ్లీ ఎంతో మందిలో స్ఫూర్తి నింపాడని వార్న్ అన్నాడు. దక్షిణాఫ్రికాతో ఇటీవల ముగిసిన టెస్టు సిరీస్ లో భారత్ 1-2 తేడాతో పరాజయం పాలైన అనంతరం టెస్టు కెప్టెన్సీ నుంచి విరాట్ కోహ్లీ అనూహ్యంగా వైదొలిగిన విషయం తెలిసిందే. అయితే, తాజాగా దీనిపై షేన్ వార్న్ స్పందించాడు.

‘విరాట్ కోహ్లీ గొప్ప నాయకుడు అందులో ఏమాత్రం సందేహం లేదు. కోహ్లీ అద్భుతమైన క్రికెటర్. అతడి నాయకత్వంలోనే భారత్ టెస్టు క్రికెట్లో అత్యున్నత శిఖరాలను అధిరోహించింది. వ్యూహాల విషయంలో అతడు మెరుగు పడాల్సి ఉన్నా.. నాయకుడిగా కొనసాగినంత కాలం జట్టు సభ్యుల్లో స్ఫూర్తి నింపాడు కోహ్లీ. తనదైన ఆటతీరుతో టెస్టు క్రికెట్ ను ముందుకు తీసుకెళ్లిన తీరు చూశాక అతడిపై గౌరవం మరింత పెరిగింది’ అని షేన్ వార్న్ విరాట్ ని ఆకాశానికెత్తాడు.

టెస్టు ఫార్మాట్ అంటే కోహ్లీకి మక్కువ ఎక్కువ. ప్రస్తుత T-20 క్రికెట్ యుగంలో కూడా టెస్టు క్రికెట్ కు ఆదరణ పెరిగిందంటే అది కోహ్లీ వంటి గొప్ప ఆటగాళ్ల వల్లనే సాధ్యమైంది. బీసీసీఐ టెస్ట్ క్రికెటీను ప్రోత్సహించడంలో ఎప్పుడూ ముందుంటుంది. ఆ విషయంలో మనమంతా కోహ్లీకి, అతడికి సహకరించిన బీసీసీఐకి థాంక్స్ చెప్పాలి. అయితే, విరాట్ కోహ్లీ అనంతరం భారత జట్టు కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించే విషయంలో రోహిత్ శర్మ కే తొలి ప్రాధాన్యం ఇవ్వాలని షేన్ వార్న్ తెలిపాడు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYF

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here