సౌర తుఫాను కారణంగా కుప్పకూలిన స్పేస్ ఎక్స్ కి చెందిన 40 ఉపగ్రహాలు

ప్రపంచ కుబేరుడు ‘ఎలన్ మస్క్’ యొక్క ప్రతిష్టాత్మక వాణిజ్య అంతరిక్ష సంస్థ SpaceX (స్పేస్ ఎక్స్) భారీ నష్టాన్ని చవిచూసింది. ఫిబ్రవరి 3న తాను ప్రయోగించిన 49 ఉపగ్రహాలలో 40 ఉపగ్రహాలు సౌర తుఫాను కారణంగా భూమి యొక్క వాతావరణంలోకి ప్రవేశించి కుప్పకూలాయి అని తెలిపింది. సౌర తుఫాను మునుపటి ప్రయోగాల సమయంలో కంటే 50 శాతం ఎక్కువ డ్రాగ్ కలిగించిందని మరియు ఉపగ్రహాలు వాటి ఉద్దేశించిన కక్ష్యను చేరుకోకుండా నిరోధించిందని సంస్థ వెల్లడించింది. దురదృష్టవశాత్తు కక్ష్యలోని ఉపగ్రహాలు శుక్రవారం సౌర తుఫాను కారణంగా గణనీయంగా ప్రభావితమయ్యాయి.

స్పేస్ ఎక్స్ ఇంజనీర్లు డ్రాగ్‌ను తగ్గించే ప్రయత్నంలో ఉపగ్రహాలను “షీట్ ఆఫ్ పేపర్” లాగా ఎగరడానికి ప్రయత్నించారని, అయితే కేవలం తొమ్మిది ఉపగ్రహాలు మాత్రమే భూ సౌర తుఫానును తట్టుకుని నిలబడగలిగాయని కంపెనీ తెలిపింది. కానీ, తమ కక్ష్యను చేరుకోవడంలో విఫలమైన దాదాపు 40 ఉపగ్రహాలు ఇతర ఉపగ్రహాలను ఢీ కోటీ అవకాశాలు లేవు అని స్పేస్ ఎక్స్ ప్రకటించింది. అవి భూమి యొక్క వాతావరణంలోకి ప్రవేశించినప్పుడు, ఈ ఉపగ్రహాలు వాటంతట అవే పేలిపోతాయి. దీంతో కక్ష్యలో వీటికి సంబంధించిన ఎలాంటి వ్యర్థాలు ఉండవు మరియు ఉపగ్రహ భాగాయాలు భూమిని తాకవు అని స్పేస్ ఎక్స్ తన ప్రకటనలో తెలిపింది.

ఈ సందర్భంగా.. తక్కువ ఎత్తులో ఉపగ్రహాలను నిలపడం మాకు అధిక ఖర్చుతో కూడుకున్నది అని అంగీకరించింది. ప్రపంచవ్యాప్తంగా వేగవంతమైన బ్రాడ్‌బ్యాండ్ సేవలను అందించడానికి గాను, భూసంబంధమైన వ్యవస్థల పరిధిలోకి రాని ప్రాంతాల్లో కూడా స్టార్‌లింక్ తన ఉపగ్రహాలను ఉపయోగించనుంది. ఈ ప్రాజెక్ట్‌లో భాగంగా భూమి కక్ష్య నుంచి అతి తక్కువ ఎత్తులో 12,000 కంటే ఎక్కువ ఉపగ్రహాల సముదాయాన్ని నిర్వహించాలని కంపెనీ లక్ష్యంగా పెట్టుకుంది. అయితే, ప్రస్తుతం జరిగిన 40 ఉపగ్రహాల నష్టం భారీ నష్టాన్ని మిగిల్చింది.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ