పండుగల ప్రభావం: భారీగా పెరిగిన పెట్రోలు, విద్యుత్ వినియోగం

The Effect Of Festivals Is Huge Increase In Consumption Of Petrol LPG Electricity And Aviation Fuel

పండుగల సీజన్ కారణంగా అక్టోబర్ నెలలో దేశంలో పెట్రోల్ అమ్మకాలు 7.3 శాతం పెరిగాయి. అయితే డీజిల్ వినియోగం 3.3 శాతం తగ్గింది. విద్యుత్ వినియోగం కూడా 14,047 కోట్ల యూనిట్లకు చేరుకుంది. పండుగ కారణంగా వంటగ్యాస్, విమాన ఇంధన వినియోగాయాలు కూడా పెరిగినట్లు ప్రభుత్వ రంగ చమురు కంపెనీలు వెల్లడించాయి.

అక్టోబర్‌లో 31 లక్షల టన్నుల పెట్రోలు అమ్ముడయ్యింది. అంతకు ముందు ఏడాది ఇదే నెలలో 28.7 లక్షల టన్నులు అమ్ముడు పోయింది. డీజిల్ అమ్మకాలు శాతం. 67 లక్షల టన్నులు విక్రయించగా 3.3 శాతం తగ్గింది. పండుగల సీజన్‌లో భాగంగా వినియోగదారులు వ్యక్తిగత వాహనాలను ఎక్కువగా వినియోగించుకున్నందున పెట్రోల్ విక్రయాలు పెరిగాయని, నవంబర్‌లో దీపావళి పండుగ నుండి వివిధ నగరాల్లో అనేక ఉత్పత్తుల విక్రయాలు గరిష్ట స్థాయికి చేరుకున్నాయని దీంతో రవాణా కూడా పెరిగి పెట్రోలు విక్రయ ధర మరింత పెరిగే అవకాశం ఉందని ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు. వర్షాల కారణంగా వ్యవసాయ పనులు తగ్గిపోయాయని ట్రాక్టర్లు, హార్వెస్టర్ల వినియోగం కూడా తగ్గడంతో డీజిల్ అమ్మకాలు మందకించడానికి ఇదే కారణమని నిపుణులు చెబుతున్నారు.

దేశవ్యాప్తంగా పెరిగిన విద్యుత్ వినియోగం
గత అక్టోబర్‌లో దేశవ్యాప్తంగా 14,047 కోట్ల యూనిట్ల విద్యుత్ వినియోగం జరిగింది. ఇది గతేడాది 2023 అక్టోబర్ నెలలో 13,944 కోట్ల యూనిట్ల తో పోలిస్తే 1 శాతం పెరిగింది. 2022 ఇదే కాలంలో 11,394 యూనిట్ల విద్యుత్ వినియోగించినట్లు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. మే నెలలో విపరీతమైన వేడి వాతావరణం నెలకొనడంతో ఈసారి విద్యుత్ డిమాండ్ ఆల్ టైమ్ గరిష్ఠ స్థాయి 250 గిగావాట్లకు చేరుకుంది. ఉత్తర భారతంలో ఉష్ణోగ్రతలు పెరగడంతో ఎయిర్ కండిషనర్లు, ఎయిర్ కూలర్ల వినియోగం పెరిగడంతో విద్యుత్ వినియోగం పెరిగిందని కేంద్రం తెలిపింది. రానున్న రోజుల్లో వాణిజ్య, పారిశ్రామిక కార్యకలాపాలు పెరగనున్నందున విద్యుత్ డిమాండ్ మరియు వినియోగం కూడా పెరుగుతుందని అంచనా.

పెరిగిన ఎల్పీజీ, విమాన ఇంధన వినియోగం 
పండుగ కారణంగా వంటగ్యాస్, విమాన ఇంధన వినియోగం కూడా పెరిగింది. గతేడాదితో పోలిస్తే ఎల్‌పీజీ సిలిండర్‌ విక్రయాలు శాతం. 7.3% పెరుగుదల ఉంటే, విమాన ఇంధనం అమ్మకం 2.5 శాతం పెరిగింది.