ప్రస్తుత ఉరుకుల పరుగుల జీవితంలో మనకు తెలియకుండానే చెవి ఆరోగ్యాన్ని విస్మరిస్తున్నాం. దీనివల్ల కలిగే తీవ్రమైన పరిణామాలపై ప్రముఖ ఆడియోలజిస్ట్ అశ్విని నక్కా హెచ్చరిస్తున్నారు. మాంగో లైఫ్ నిర్వహించిన ప్రత్యేక ఇంటర్వ్యూలో ఆమె చెవి సంరక్షణపై కీలక విషయాలను పంచుకున్నారు.
చాలామంది ఇయర్‌బడ్స్‌ను అతిగా వాడటం, చెవిలో గుబిలిని తీయడానికి పిన్నులు ఉపయోగించడం వల్ల కర్ణభేరి దెబ్బతినే ప్రమాదం ఉందని తెలిపారు. వినికిడి తగ్గడం లేదా చెవిలో వింత శబ్దాలు రావడం (Tinnitus) వంటి లక్షణాలను ప్రాథమిక దశలోనే గుర్తించాలని సూచించారు. ఇయర్‌ఫోన్స్ వాడేటప్పుడు వాల్యూమ్ తక్కువగా ఉంచుకోవడం, నిరంతర శబ్ద కాలుష్యం నుంచి దూరంగా ఉండటం వంటి జాగ్రత్తలు తీసుకోవాలని ఈ చర్చలో స్పష్టం చేశారు. చెవి ఆరోగ్యంపై అవగాహన కోసం ఈ వీడియో తప్పక చూడండి.






































