హిందూ మతంలో ఒక ముఖ్యమైన ఘట్టం కుంభమేళా. దీనికోసం ప్రతీ హిందువు ఎదురుచూస్తుంటారు. మహా కుంభమేళా సందర్భంగా.. పవిత్రమైన నదిలో స్నానం చేస్తే పాపాలన్నీ హరిస్తాయని చాలామంది నమ్మకం.కుంభమేళా సమయంలో కోట్లాది మంది భక్తులు తరలివచ్చి పుణ్య నదిలో స్నానాలు ఆచరిస్తారు.
12 ఏళ్ల తర్వాత 2025లో మహా కుంభమేళా నిర్వహించనున్నారు. అయితే ఈ కుంభమేళాను ఎప్పుడూ భారతదేశంలోని 4 పవిత్ర నదులు, 4 పుణ్యక్షేత్రాల్లో మాత్రమే నిర్వహిస్తారు. ప్రయాగ్‌రాజ్, నాసిక్, హరిద్వార్, ఉజ్జయినిలలో ఈ మహా కుంభమేళాను నిర్వహించనున్నరు.
నిజానికి పురాణాల కాలం నుంచి కుంభమేళాను నిర్వహిస్తున్నట్లు చరిత్ర చెబుతోంది. వచ్చే ఏడాది ప్రయాగ్‌రాజ్‌లో ఈసారి కుంభమేళాను నిర్వహించనున్నారు. బృహస్పతి వృషభరాశిలో ఉన్నప్పుడు, సూర్యుడు మకరరాశిలో ఉన్నప్పుడు, ప్రయాగ్‌రాజ్‌లో మహా కుంభమేళా నిర్వహిస్తారు.
2025 సంవత్సరంలో మహా కుంభమేళాను జనవరి 13న పుష్య మాసంలోని పౌర్ణమి తిధిలో ప్రారంభిస్తారు. ఈ కుంభమేళా ఫిబ్రవరి 26వ తేదీన మహాశివరాత్రి రోజున ముగుస్తుంది. 12 ఏళ్ల తర్వాత ప్రయాగ్‌రాజ్‌లో మహాకుంభ మేళా నిర్వహించనున్నారు. అంతకుముందు 2013లో ప్రయాగ్‌రాజ్‌లో మహాకుంభమేళాను నిర్వహించారు.
అయితే జనవరి 13 న ప్రారంభమై.. ఫిబ్రవరి 26న ముగిసే కుంభమేళాలో కొన్ని ముఖ్యమైన మంచి ముహూర్తాలు ఉన్నాయని ఆసమయంలో స్నానాలు ఆచరిస్తే సకల పుణ్యాలు లభిస్తాయని పండితులు చెబుతున్నారు. పుష్య మాసం పౌర్ణమి – 13 జనవరి 2025, మకర సంక్రాంతి – 14 జనవరి 2025,మౌని అమావాస్య – 29 జనవరి 2025,వసంత పంచమి – 3 ఫిబ్రవరి 2025, మాఘ పౌర్ణమి – 12 ఫిబ్రవరి 2025, మహా శివరాత్రి – 26 ఫిబ్రవరి 2025న పుణ్యస్నానాలకు మంచి తేదీలని అంటున్నారు.
అయితే ఈ కుంభమేళాను ప్రయాగ్‌రాజ్ లో.. బృహస్పతి వృషభరాశిలో, సూర్యుడు మకరరాశిలో ఉన్న సమయంలో ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళా నిర్వహిస్తారు.అలాగే హరిద్వార్ లో.. సూర్యుడు మేషరాశిలో, బృహస్పతి కుంభరాశిలో ఉన్న సమయంలో హరిద్వార్‌లో కుంభమేళాను నిర్వహిస్తారు.
ఇక నాసిక్ లో.. సూర్యుడు, బృహస్పతిలిద్దరూ సింహరాశిలో ఉన్నప్పుడు మహారాష్ట్రలోని నాసిక్‌లో కుంభమేళాను జరుపుతారు.
అలాగే ఉజ్జయిని లో.. బృహస్పతి సింహరాశిలో ఉన్న సమయంలో.. సూర్యుడు మేషరాశిలో ఉన్నప్పుడు ఉజ్జయినిలో కుంభమేళా జరుగుతుంది