దేవుణ్ని నమ్మినవారికి ఆధ్యాత్మికపరంగా ఎన్నో సందేహాలుంటాయి. కొన్నిటికి పెద్దల నుంచి సమాధానం దొరికినా.. మరికొన్నివాటిపై ఆ అనుమానాలు అలానే ఉండిపోతాయి. శ్రీరాముని పట్టాభిషేకం ఫోటో విషయంలోనూ ఇలాంటి ప్రశ్నే చాలా మందిని వేధిస్తూనే ఉంటుంది.ఓం అనే శబ్దంలోంచి పుట్టిన ప్రతి శబ్ధానికీ కూడా శక్తి ఉంటుందని పురాణాలు చెబుతున్నాయి.. నిజానికి ప్రతి బీజాక్షరానికీ శక్తి ఉంటుందని వేదపండితులు చెబుతూ ఉంటారు. బీజాక్షరాలుగా ఉద్భవించిన అక్షరాలను మనం ఉచ్ఛరించినప్పుడు మన శరీరంలో శక్తి జనిస్తుంది. ఇలా పుట్టిన శక్తితోనే ఎలాంటి సంకల్పాలు అయినా నెరవేరతాయి.ఆ ’ఓం’కారానికి ప్రత్యామ్నాయ మార్గమే శ్రీరామ పట్టాభిషేకం ఫోటో అని పండితులు చెబుతున్నారు. శ్రీరామ పట్టాభిషేక ఫోటో ఉన్నఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఉండదని అంటున్నారు.
నిజానికి రాముడి పూజ వాళ్లు చేయొచ్చా, వీళ్లు చేయొచ్చా అని అనుమానం ఉండకూడదు. ఓంకారానికి ప్రతీ రోజూ పూజ చేయడం ఎంత గొప్పదో అలాగే రోజూ పట్టాభిషేక మూర్తికి పూజ చేయడం అంత గొప్పదట. రాముడిని వీర రాఘవ, విజయ రాఘవ అని భక్తులు పిలుచకుంటారు. రాముడు ఎల్లవేళలా కోదండం చేతిలో పట్టుకుని ఉంటాడు. అపజయం అన్నది రాముడికి లేదు కాబట్టి.. అలాంటి రాముడు
ఇంట్లో ఉంటే నిర్భయత్వం, శత్రుభయం ఉండదని వేదపండితులు చెబుతున్నారు.ఎవరైనా నిరుద్యోగ సమస్యతో బాధపడుతున్నా.. ఎవరినైనా శత్రుభయం వెంటాడుతున్నా, ఇంట్లో ఆందోళనలు ఉన్నా, డిప్రెషన్ కి గురైనా చివరకు తమకంటూ ప్రత్యేక గుర్తింపు దొరకలేదని చింతిస్తున్నా.. ఇలాంటి వారందరికీ శ్రీరామ పట్టాభిషేకం ఫోటో పరిష్కారం చూపిస్తుందని పెద్దలు చెబుతున్నారు. ప్రతిరోజూ ఉదయాన్నే స్నానాదికార్యక్రమాలు ముగిసాక శ్రీరాముని పట్టాభిషేక ఫోటో ముందు శ్రీ రామనామాన్ని 21 సార్లు లేదా 11 సార్లు పఠిస్తే ఎలాంటివారికి అయినా శుభం జరుగుతుందని చెబుతారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY