గోవా వెళ్లే పర్యాటకులు వాటర్ స్పోర్ట్స్ విషయంలో జాగ్రత్తగా ఉండాలని Vlogger Vamshi హెచ్చరిస్తున్నారు. ఈ వ్లాగ్‌లో ఆయన తన అనుభవాలను పంచుకుంటూ, ప్యాకేజీల పేరుతో పర్యాటకులను ఎలా ఇబ్బంది పెడుతున్నారో వివరించారు.
ప్రధానంగా స్కూబా డైవింగ్, పారాసైలింగ్ మరియు ఇతర రైడ్ల కోసం రోజంతా సమయం వృధా చేస్తున్నారని తీరా అక్కడికి వెళ్ళిన తర్వాత ఒక్కో రైడ్‌ను కేవలం 30 సెకన్ల కంటే ఎక్కువ సేపు చేయనివ్వడం లేదని తెలిపారు . అడ్వెంచర్ ఇష్టపడే వారు తప్ప, సాధారణ పర్యాటకులు అంత దూరం వెళ్లి సమయం వృధా చేసుకోవద్దని ఆయన సూచించారు. గోవాలో Peaceful Vibes కోసం Candolim బీచ్ ఉత్తమమని ఆయన సిఫార్సు చేశారు. పూర్తి వివరాల కోసం ఈ వీడియో చూడండి.





































