కొంతమందికి మాత్రమే రిటైర్మెంట్ తీసుకున్నాక కూడా నెల నెలా పింఛన్ అందుకునే అవకాశం ఉంటుంది. అయితే కాస్తంత అవేర్నెస్‌తో ముందుగానే డబ్బును సరైన మార్గంలో పెడితే ప్రతీ నెలా పెన్షన్ అందుకునే అవకాశం ఉంటుందని ఆర్ధిక నిపుణులు చెబుతున్నారు.ఇది ప్రభుత్వ పథకమే అయినా చాలామందికి దీనిపై అవగాహన ఉండదు.ఇది చిన్న పొదుపు పథకం కింద పనిచేస్తుంది. ఈ పథకం రిటైర్మెంట్ ప్రణాళిక కోసం ఉన్న మంచి పథకాలలో ఒకటి అని నిపుణులు చెబుతున్నారు.
పోస్ట్ ఆఫీస్ పథకాలలో సీనియర్ సిటిజన్ సేవింగ్ స్కీమ్ ద్వారా.. సీనియర్ సిటిజన్లకు ఈ పథకం ద్వారా ప్రతి నెలా ఐదేళ్లపాటు 20 వేలు పొందొవచ్చు. ఈ ప్రభుత్వ పథకం కింద 8.2 శాతం వడ్డీ లభిస్తుంది. ఎస్సీఎస్ఎస్ పథకంలో 5 సంవత్సరాల మెచ్యూరిటీ సదుపాయం ఉంది. దీనిలో నెలవారీ పెట్టుబడికి బదులు ఒక్కసారి మాత్రమే డబ్బును పెట్టుబడి పెట్టాలి.
పోస్ట్ ఆఫీస్ యొక్క ఈ చిన్న పొదుపు పథకాల క్రింద.. సీనియర్ సిటిజన్లకు ఉపయోగకరంగా ప్రయోజనాలు అందించబడతాయి. 60 ఏళ్లు పైబడిన వాళ్లు మాత్రమే ఇందులో పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది. ఈ పథకంలో ఒకేసారి డబ్బును డిపాజిట్ చేయొచ్చు. ఈ పథకంలో గరిష్టంగా 30 లక్షలు వరకూ పెట్టుబడి పెట్టొచ్చు. అయితే ఈ పథకంలో డిపాజిట్ ఇంతకు ముందు 15 లక్షలు ఉండేది ..ఇప్పుడు దాన్ని రూ. 30 లక్షలకు చేర్చారు.
సీనియర్ సిటిజన్ సేవింగ్ స్కీమ్ కింద రూ. 30 లక్షలు పెట్టుబడి పెడితే.. వాళ్లకు ప్రతి సంవత్సరం సుమారు రూ. 2 లక్షల 46 వేల వడ్డీ వస్తుంది. ఈ మొత్తాన్ని నెలవారీ ప్రాతిపదికన లెక్కపెడితే ఈ మొత్తం 20,500 రూపాయలు అవుతుంది. ఈ పథకం కింద.. 55, 60 ఏళ్ల మధ్య వీఆర్ఎస్ అంటే.. స్వచ్ఛంద పదవీ విరమణ తీసుకునే వ్యక్తులు కూడా ఖాతాను తెరవవచ్చు.
వారికి దగ్గరలోని ఏదైనా పోస్టాఫీసును సందర్శించి అక్కడ ఖాతాను ఓపెన్ చేయాలి. అయితే ఈ పథకం కింద ఆదాయం పొందుతున్నవాళ్లు కూడా పన్ను చెల్లించాల్సి ఉంటుంది. ఈ సేవింగ్స్ స్కీమ్‌పై వడ్డీ 50 వేల కంటే ఎక్కువగా ఉంటే..దానిపై టీడీఎస్ చెల్లించాల్సి ఉంటుంది.