కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో గల ఇండియన్ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ అయిన.. గూగుల్ క్రోమ్ తమ వినియోగదారుల కోసం ఒక భద్రతా హెచ్చరికను జారీ చేసింది. ఈ వార్నింగ్‌ను గూగుల్ వెబ్ బ్రౌజర్‌లో వినియోగదారులు తమ ప్రైవేట్ డేటాను. హ్యాకర్స్ యాక్సెస్ చేయడానికి అనుమతించే ముఖ్యమైన ఒక లోపాన్ని హైలైట్ చేసింది. ఇది స్మార్ట్‌ఫోన్‌లు, ల్యాప్‌టాప్‌లు రెండింటి మీద ప్రభావితం చూపిస్తుందని చెప్పింది. దీని వల్ల ప్రొటెన్షియల్ ఫ్రాడ్, డేటా ఉల్లంఘనలు జరిగే అవకాశం ఉందని గూగుల్ క్రోమ్ ఆందోళన చెందుతోంది.
ల్యాప్‌టాప్‌లు, స్మార్ట్‌ఫోన్‌లు, కంప్యూటర్‌లతో సహా మనం వాడే గ్యాడ్జెట్ పరికరాలను రిమోట్‌గా యాక్సెస్ చేయడానికి హ్యాకర్లు ఈ బ్రీచ్ ఉపయోగిస్తారని CERT-In హెచ్చరించింది. హ్యాకర్లు డేంజరస్ కోడ్‌లను ఉపయోగించి మన ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ లోని యాప్‌లను క్రాష్ చేయవచ్చు. దీనివల్ల డేటా చోరీ జరిగే అవకాశం ఎక్కువగా ఉందని పేర్కొంది. దీనివల్ల ఫోన్ లేదా ల్యాప్ ట్యాప్ లోని ఏదైనా యాప్ తప్పుగా పని చేస్తుంది . ఆ యాప్‌ను సరిగ్గా ఉపయోగించడంలో ఇబ్బందులు ఎదుర్కొంటారు.
సెక్యూరిటీ బ్రీచ్ విండోస్, వ్యాక్ ఓఎస్, లైనెక్స్ సిస్టమ్‌లలో పనిచేసే వినియోగదారులు డేంజర్ జోన్ లో పడినట్లు అవుతుంది . గూగుల్ క్రోమ్ అనేది ప్రపంచవ్యాప్తంగా అత్యంత ప్రజాదరణ పొందిన వెబ్ బ్రౌజర్ కాబట్టి.. 70% మార్కెట్ వాటాతో మిలియన్ల మంది డేంజర్లో పడే అవకాశం ఉంది. ఈ లోపం యాడ్రాయిడ్, ఐఓఎస్, పర్సనల్ కంప్యూటర్లతో పాటు అన్ని పరికరాల్లోని వినియోగదారులను ప్రభావితం చేస్తుంది. దీని వల్ల ప్రతి ఒక్కరూ తక్షణ చర్యలు తీసుకోవడం చాలా అవసరమని గూగుల్ క్రోమ్ చెబుతోంది.
దీనికోసం మెుబైల్, ల్యాప్ ట్యాప్ వినియోగదారులు గూగుల్ ప్లే స్టోర్ లేదా ఆపిల్ యాప్ స్టోర్లోకి వెళ్లాలి. గూగుల్ క్రోమ్ కోసం సెర్చ్ చేసి.. అందుబాటులో ఉన్న అప్ డేట్ కోసం వెతకాలి. అప్‌డేట్ అందుబాటులో ఉంటే వెంటనే డౌన్‌లోడ్ చేసి ఇన్‌స్టాల్ చేసుకోవాలి. అప్‌డేట్ చేసిన తర్వాత యాప్‌ని మళ్లీ ప్రారంభించాలి.