పాన్, ఆధార్ రెండూ చెల్లవు.. డిసెంబర్ 31లోపు అలా చేయాలని కేంద్రం కొత్త రూల్..

Both Pan And Aadhaar Are Invalid | Mango News Telugu

ఇప్పుడు అన్ని ఆర్ధిక లావాదేవీలకు పాన్ కార్డు తప్పనిసరిగా మారింది. బ్యాంకు అకౌంట్ ఉన్న ప్రతి ఒక్కరికీ పాన్ కార్డు ఉండాల్సిందే. అందుకే ఎప్పటికప్పుడు పాన్ కార్డులు వాడుతున్న వారి కోసం కేంద్ర ప్రభుత్వం అప్ డేట్స్ ఇస్తూనే ఉంటుంది.తాజాగా .. డిసెంబరు 31లోగా పాన్ కార్డ్ హోల్డర్లు అలా చేయకపోతే పాన్, ఆధార్ రెండూ పనిచేయకుండా పోతాయని కేంద్ర ప్రభుత్వం హెచ్చరించింది.

దేశంలోని ప్రతి ఒక్కరి దగ్గర ఆధార్ కార్డు, పాన్ కార్డు తప్పనిసరిగా ఉండాల్సిందే. ప్రభుత్వాలు పథకాలు ఇవ్వడానికి కూడా ఈ రెండు కార్డులనే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పరిగణనలోకి తీసుకుంటున్నాయి. అయితే ఈ మధ్య కాలంలో సైబర్ నేరగాళ్లు, పాన్ లేదా ఆధార్ కార్డును ఉపయోగించి నేరాలకు పాల్పడుతున్నారు. దీనికి అడ్డకట్ట వేయడానికి కేంద్రప్రభుత్వం కీలక నిర్ణయాన్ని తీసుకుంది.

ఆధార్ కార్డు, పాన్ కార్డుదారులంతా తప్పనిసరిగా రెండింటినీ లింక్ చేసి తీరాలని కేంద్రం చాలా సార్లు చెప్పింది. అయితే ఇప్పటివరకూ చేయని వారు.. ఇప్పటికైనా చేయాల్సిందేనంటూ కేంద్ర ప్రభుత్వం డెడ్‌లైన్ నిర్ణయించింది. డిసెంబర్ 31 లోగా.. పాన్ కార్డును, ఆధార్ కార్డుకు లింక్ చేయాలని సూచించింది.

ఇలా ఇప్పటి వరకు చేయని వారి పాన్, ఆధార్ కార్డులను రద్దు చేస్తామని హెచ్చరించింది. ఇటీవల కాలంలో కొన్ని రకాల టెక్, ఫైనాన్స్ కంపెనీల కు చెందినవారు.. సామాన్యులకు ఫోన్లు చేస్తూ లోన్లు తీసుకోమని నానా ఇబ్బందులు పెడుతున్నాయి. లోన్స్ తీసుకుని సకాలంలో చెల్లించి.. క్రెడిట్ స్కోర్ పెంచుకోవాలని కాల్స్ చేసి ఇరిటేషన్ తెప్పిస్తున్నాయి. ఇలాంటి పనికిరాని కాల్స్, సైబర్ నేరాలకు అడ్డుకట్ట వేయడానికి కేంద్ర హోంశాఖ.. ఆదాయపు పన్ను శాఖకు తాజాగా ప్రత్యేక ఆదేశాలిచ్చింది. వ్యక్తుల వ్యక్తిగత డేటాను ఎవరికీ చేరకుండా చేయాలని కేంద్రం ఆదేశాలు జారీ చేసింది.

ఇదివరకు ఫిన్‌టెక్, లోన్ కంపెనీలు..ఆయా వ్యక్తులకు ఫోన్ చేసి వారి పాన్ కార్డ్ వివరాను వాడుకుని.. కస్టమర్ ప్రొఫైల్స్ తయారుచేసేవి. దీని ద్వారా తమ బిజినెస్ నిర్వహించుకునేవి. అంతేకాదు ఈ పారన్ కార్డు వివరాలతో ఆ వ్యక్తులకు తెలియకుండానే.. వారి పాన్ కార్డు వివరాలను లోన్లు ఇవ్వడానికి,, తీసుకోడానికి కూడా వాడేస్తున్నారు. ఇదంతా చట్ట విరుద్ధంగానే నడిపిస్తున్నారు. దీంతోనే కేంద్రం కొత్త నిబంధనలు తీసుకువచ్చింది. ఎవరైనా అనుమతి లేకుండా ఇతరుల పాన్ వివరాలు, ఆధార్ వివరాలను వాడుకుంటే.. జైలు శిక్షతో పాటు భారీ జరిమానా చెల్లించాల్సి ఉంటుందని కేంద్రం హెచ్చరిస్తోంది.

ప్రజలు పాన్ కార్డు, ఆధార్ కార్డును లింక్ చేసుకోవడానికి డిసెంబర్ 31 వరకూ గడువు ఉంది కాబట్టి.. వీలు చూసుకొని.. ఇన్‌కంటాక్స్ సైట్‌ అయిన https://www.incometax.gov.in/iec/foportal లోకి వెళ్లి.. పాన్ కార్డుకి ఆధార్ కార్డు నంబర్ ఇచ్చి, లింక్ చేసుకోవాలి. ఇలా చేయని వారికి.. డిసెంబర్ 31 తర్వాత పాన్ కార్డు, ఆధార్ కార్డు పనిచేయవని కేంద్రం తెలిపింది. ఇలా చేస్తే ఇతరులు మిస్ యూజ్ చేసే అవకాశం తక్కువగా ఉంటుందని కేంద్రం భావిస్తోంది.