దేశంలో సైబర్ నేరాలుయ రోజురోజుకు పెరిగిపోతున్నాయి. ముఖ్యంగా తెలంగాణలో సైబర్ నేరాల సంఖ్య పెరుగుతోందని నిపుణులు చెబుతున్నారు. ఎంతగా అవగాహన కల్పించినా కూడా మోసగాళ్ల చేతిలో అమాయకులు చిక్కుకుని డబ్బులు పోగొట్టుకుంటున్నారని అంటున్నారు.
సైబర్ మోసాల వల్ల తెలంగాణకు చెందిన వారు రోజుకు రూ. 4- 5 కోట్ల వరకు నష్టపోతున్నారని తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో డైరెక్టర్ చెబుతున్నారు. తాజాగా హైదరాబాద్ వార్షిక సైబర్ సెక్యూరిటీ నాలెడ్జ్ కార్యక్రమంలో మాట్లాడిన నిపుణులు..దేశంలోనే సైబర్ మోసాల వల్ల ఎక్కువగా నష్టపోతున్న మొదటి ఐదు రాష్ట్రాల్లో తెలంగాణ ఉందని వివరించారు.
వీటిలో 96 శాతం జరిగిన సైబర్ నేరాలలో.. మోసపూరిత లింక్‌లపై క్లిక్ చేయడం లేదా స్కామర్‌లతో కీలకమైన తమ వ్యక్తిగత సమాచారాన్ని పంచుకోవడం వంటి వల్ల జరుగుతున్నాయని నిపుణులు పేర్కొన్నారు. ఇదంతా మానవ తప్పిదాల ఫలితమేనని అంటున్నారు. 1930 హెల్ప్‌లైన్‌కి తెలంగాణవ్యాప్తంగా ప్రతిరోజూ కనీసం 1,200 డిస్ట్రెస్ కాల్‌లు వస్తున్నట్లు చెప్పారు. పెరుగుతున్న సైబర్‌క్రైమ్ మోసాలకు ఇది నిదర్శమన్నారు.
2035 నాటికి గ్లోబల్ సైబర్ క్రైమ్ నష్టం 10.5 ట్రిలియన్‌లకు చేరుకుంటుందని అంచనా వేశారు. ఈ కార్యక్రమంలో హ్యాక్ 2.0 సమ్మిట్ సైబర్ సెక్యూరిటీ నిపుణులు, ప్రభుత్వ అధికారులు, లా ఎన్‌ఫోర్స్‌మెంట్‌లు, వివిధ పరిశ్రమలకు చెందిన ప్రముఖులను కలిసి పెరుగుతున్న సైబర్ ముప్పుపైన చర్చించారు. అటు మహారాష్ట్ర అదనపు డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్, బ్రిజేష్ సింగ్ ఇంటర్నెట్ గురించి వివరించారు. సైబర్ క్రైమ్ పరిశోధనలకు సహాయం చేయడంలో సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌ల సమ్మతి ప్రాముఖ్యతను ఎక్స్ ప్లెయిన్ చేశారు.
కాగా హ్యాక్ 2.0 కార్యక్రమానికి ఐటీ శాఖ మంత్రి డి .శ్రీధర్ బాబు ముఖ్య అతిథిగా వచ్చారు. తెలంగాణ డిజిటల్ తెలంగాణ” చొరవకు సైబర్ భద్రత కేంద్రంగా ఉంటుందని ఆయన అన్నారు. సైబర్ సెక్యూరిటీ సొల్యూషన్స్‌ను అమలు చేయడంలో తెలంగాణను అగ్రగామిగా మార్చడానికి తాము కృషి చేస్తున్నట్లు చెప్పారు.